ఆమెతో లేచిపోయిన ఈమె.. ఆ తరువాత ఏమైందో తెలుసా?

A woman married another woman

03:55 PM ON 8th July, 2016 By Mirchi Vilas

A woman married another woman

ఏంటీ టైటిల్ చూసి వెటకారం అనుకుంటున్నారా? లేక ఏదైనా మెలిక ఉందనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు తప్పులో కాలు వేసినట్లే. ఇది అక్షరాలా నిజం. ఆ వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ కు చెందిన ఈ డిఫరెంట్ లవ్ స్టోరీలో ఆరు నెలలు గడిచిన తర్వాత ఓ ట్విస్ట్ వల్ల ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ అసలు ఆ ఇద్దరు మహిళల లవ్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే కథలోకి వెళ్ళిపోదాం.. రాజస్తాన్ కు చెందిన మమత, సోనియా పక్కపక్క ఇళ్లలో ఉండే ఇద్దరు వివాహితలు. వీరిద్దరికీ వేర్వేరు వ్యక్తులతో 2008లో వివాహమైంది.

వీరిద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు. భర్తలు, పిల్లలు బయటకు వెళ్లిపోయిన తర్వాత వీరిద్దరూ ఒక దగ్గరకు చేరి మట్లాడుకుంటూ ఉండేవారు. అలా వారి స్నేహం బలపడింది. కొన్నాళ్లకు ఆ స్నేహం ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి వచ్చాక.. ఇద్దరూ తమ కుటుంబాలను వదిలేసి లేచిపోయారు. తర్వాత ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. సోనియా భర్తగా వ్యవహరించి మమత మెడలో తాళి కట్టింది. అలా ఆర్నెళ్లు వారి కాపురం సుఖంగా సాగాక.. వారి గురించి మమత కుటుంబ సభ్యులకు తెలిసింది. మమత కుటుంబ సభ్యులు మమతతో మాట్లాడి.. మీ పెళ్లికి అందరూ ఒప్పుకున్నారు.. కాబట్టి మాతో వచ్చేయండి అని నమ్మబలికారు.

మమతతో పాటు సోనియాను కూడా తమ వెంట తీసుకెళ్లిన మమత కుటుంబ సభ్యులు సోనియాను చితకబాది ఊర్లోనుండి తరమేశారు. మమత ఆ తర్వాత కనించకుండాపోయింది. అప్పట్నుంచి మమత జాడ కోసం సోనియా ఎంతగానో ప్రయత్నించింది. అయినా లాభం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మమత కోరికలు తీర్చడానికి తనకున్నవన్నీ అమ్ముకున్నానని, ఆమె ఆచూకీ దొరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటానని సోనియా చెబుతోంది. కోర్టు మమత కుటుంబ సభ్యులకు నోటీసులు పంపింది.

English summary

A woman married another woman