గులక రాయి మింగిన చేపను కాపాడుకోడానికి ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే షాకౌతారు!

A woman paid 33 thousand to save fish

11:29 AM ON 19th October, 2016 By Mirchi Vilas

A woman paid 33 thousand to save fish

తమ పెంపుడు జంతువులను ప్రాణం కన్నా మిన్నగా చాలామంది చూసుకుంటారు. తాము ఎంతో ఇష్టంగా పెంచుకున్న వాటికి ఏమైనా అయితే వారు తట్టుకోలేరు. తల్లడిల్లిపోతారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో చోటు చేసుకుంది. 21ఏళ్ల ఎమ్మా మార్ష్ 12 డాలర్లు పెట్టి ఓ బంగారు చేపను కొని, ఇంటిలోని అక్వేరియంలో పెంచుకుంటోంది. అక్వేరియంలో ఉన్న ఆ చేప ఓ గులకరాయిలాంటి దానిని మింగింది. ఇంకేముంది ఆ చేపను అక్వేరియంతో సహా పట్టుకుని వెటర్నిటీ సర్వీస్ సెంటర్ కు పరుగు తీసింది మార్ష్. ఎట్టకేలకు వైద్యులు.. గోల్డ్ ఫిష్ మింగిన గులకరాయిలాంటి దానిని బయటకు తీసి, చేపను ఒకరోజు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోనే ఉంచారు.

చేపను బతికించినందుకు ఎమర్జెన్సీ సర్వీస్ కింద 100 డాలర్లు, వైద్యుడికి 400 డాలర్లు మొత్తం 500 డాలర్లు(మన రూపాయిల్లో సుమారు 33వేలు) మార్ష్ చెల్లించింది. ఇది తెలిసిన వాళ్లు చేప కోసం అంత ఖర్చు పెట్టాలా! అని ఆశ్చర్యపోతుంటే, ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే పెంపుడు జంతువుల కోసం ఎంత ఖర్చు చేసినా తక్కువే అని మరికొందరు అంటున్నారు.

English summary

A woman paid 33 thousand to save fish