ప్రియుడితో లేచిపోవడానికి ఆ ఇల్లాలు వేసిన స్కెచ్ తెలిస్తే మతిపోతుంది!

A woman planned a sketch to jump with her lover

12:52 PM ON 7th September, 2016 By Mirchi Vilas

A woman planned a sketch to jump with her lover

సినీ ఫక్కీలో ప్రేమ జంటలు లేచిపోవడం చూస్తుంటాం. ఇక అక్రమ సంబంధం పెట్టుకుని పక్కింటి వాళ్ళతో లేచిపోయే వాళ్ళూ వున్నారు. అలాంటిదే ఈ ఘటన కూడా. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. అతనితో వెళ్లిపోయేందుకు ఢిల్లీకి చెందిన ఓ మహిళ పెద్ద దొంగ నాటకమే వేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీలోని లాహోరి గేట్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఇంట్లో దొంగలు ప్రవేశించి నానా బీభత్సం చేశారని, తన బట్టలు చించి లైంగికంగా వేధించారని, చివరకు జుత్తు కత్తిరించి ఇంట్లోంచి 10 లక్షల రూపాయలు దొంగతనం చేశారని అక్కడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనితో అప్రమత్తమైన పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు.

విచారణలో భాగంగా ఆ ఇంటికి సమీపంలోని సీసీ పుటేజ్ ను పరిశీలించారు. అయితే.. దొంగతనం జరిగినట్లు ఆనవాళ్లు ఎక్కడా కనిపించక పోవడంతో, ఆమె చెబుతున్నది నిజమేనా? అన్నది నిర్ధారించుకునేందుకు పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేపట్టారు. అంతేకాక పోలీసులు ఆమె కాల్ డేటా ని కూడా పరిశీలించారు. దీంతో అసలు నిజం బట్ట బయలు అయింది. ఆమె తన ఇంటికి సమీపంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. అతనితో వెళ్లిపోయేందుకే 10 లక్షల రూపాయలు దొంగిలించి, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు దొంగతనం నాటకం ఆడిందని పోలీసుల విచారణలో తేలడంతో అంతా అవాక్కయ్యారు.

ఇది కూడా చదవండి: అంత సీక్రెట్ గా కానిచ్చేసిందా?

ఇది కూడా చదవండి: గణపతి ఎదుట అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు

ఇది కూడా చదవండి: నిరోధ్ లో సెల్... జైల్లోకి పావురంతో రవాణా ...

English summary

A woman planned a sketch to jump with her lover