దానికి నో చెప్పాడని యాసిడ్ పోసేసింది!

A woman pours acid on man

11:07 AM ON 18th June, 2016 By Mirchi Vilas

A woman pours acid on man

ప్రపంచంలో మహిళల పై దాడులు జరగడం సర్వ సాధాణంగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితులలో, దీనికి భిన్నంగా పాకిస్థాన్ లో ఓ పురుషుడి పై మహిళ దాడికి దిగింది. వినడానికి కొత్తగా ఉన్నా ఇది మాత్రం నిజం. పాకిస్థాన్ లో మహిళల పై ఎప్పుడూ దాడులు జరుగుతూనే ఉంటాయి. కానీ, తాజా ఘటనతో దేశ ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ముల్తాన్ నగరానికి చెందిన మొనిల్ మాయ్(32) అనే మహిళ తన పొరుగింట్లో నివసించే ముఖ్ధుం రషీద్ అనే వ్యక్తి పై మనసు పారేసుకుంది. తనను పెళ్ళి చేసుకోమని అడగడంతో అతడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన మొనిల్, రషీద్ పై యాసిడ్ గుమ్మరించింది.

ఇది గమనించిన కొందరు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రషీద్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మొనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary

A woman pours acid on man