ప్యాంట్ లేకుండా కోర్టుకు వచ్చిన యువతి.. అది చూసి..

A woman prisoner came without phant

04:50 PM ON 4th August, 2016 By Mirchi Vilas

A woman prisoner came without phant

అవును మీరు విన్నది నిజమే ఓ యువతి ప్యాంట్ లేకుండా కోర్టుకు రావడం చూసి ఆ మహిళా జడ్జి షాక్ అయ్యింది. ఇది దారుణమంటూ పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. షాపు నుంచి వస్తువులు దొంగతనం చేసిన ఓ యువతిని జూలై 24న యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల పాటు కస్టడీలో ఉంచి గత శుక్రవారం కెంటకీ కోర్టులో హాజరు పరిచారు. అయితే ఆ యువతిని అరెస్ట్ చేసిన రోజు నుంచి కేవలం పొడవైన చొక్కా మాత్రమే ధరించి ఉంది. కోర్టులో డ్రాయర్ ను చొక్కాతో కవర్ చేసుకోవడం గమనించని జడ్జి అంబర్ వోల్ఫ్ చలించిపోయింది.

ఆ యువతికి జైలు దుస్తులు ఎందుకు ఇవ్వలేదంటూ అధికారులకు ఫోన్ చేసి మరి అడిగింది. వారి సమాధానం విని ఆశ్చర్యపోయింది. మహిళలకు అందించే ఆరోగ్యపరమైన కిట్ కూడా ఇవ్వకపోవడాన్ని జడ్జి తప్పుపట్టింది. దీన్ని నేను సహించలేనంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడ ఏం జరుగతోందని ప్రశ్నించింది. పోలీసులు ఆ స్థితి కల్పించినందుకు యువతికి ఆ జడ్జి క్షమాపణ చెప్పింది. ప్రాసిక్యూషన్ వాదనలను వినిపించుకోని జడ్జి అంబర్ వోల్ఫ్, నింధితురాలికి వంద డాలర్ల ఫైన్ విధించి కస్టడీ నుంచి విముక్తి కల్పించింది.

English summary

A woman prisoner came without phant