ఒంటిమీద చీరను విప్పి ముగ్గురు ప్రాణాలను కాపాడింది!

A woman saved 3 people with her saree

03:15 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

A woman saved 3 people with her saree

పక్కోడిని చంపైనా సరే తాను బ్రతికితే చాలు అనుకునే రోజులివి. పక్కోడి ప్రాణాలు పోతున్నా నేను బానే వున్నానుగా నాకెందుకు అనుకునే సమాజం ఇది. మానవత్వం పూర్తిగా మంట గలసిపోయిన సభ్య సమాజం మనది. అయితే మానవత్వం ఎక్కడో ఓ మూల దాగుందని కొన్ని సంఘటనల ద్వారా ఇంకా మనకు గుర్తొస్తుంది. మానవత్వం ఉన్నవారు పక్కవాళ్ళు ఆపదలో ఉంటే వారి ప్రాణాలు రక్షించే ప్రయత్నం చేస్తుంటారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచే ఇటువంటి సంఘటన మీకు తెలియజేయబోతున్నాం. నిజామాబాద్ కు చెందిన ఓ మహిళ తన ప్రాణాలకు తెగించి ధైర్య సాహసాలు చూపించి చేసిన సాహసం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడ్ గ్రామంలో ఇటీవల ఓ సంఘటన జరిగింది. ఆ గ్రామంలో ఉన్న కాకతీయ కాలువ వద్ద ఓ వ్యక్తి కాలకృత్యాలు తీర్చుకుంటుండగా అనుకోకుండా ప్రమాదవశాత్తూ ఆ వ్యక్తి కాలువలో పడిపోయాడు. దీంతో పక్కనే వెళ్తున్న పదో తరగతి విద్యార్థి కునాల్ అతన్ని రక్షించబోయి తాను కూడా కాల్వలో పడిపోయాడు. కునాల్ ను, ఆ వ్యక్తిని చూసిన దేవదాస్ అనే మరో వ్యక్తి కూడా వాళ్ళను రక్షించేందుకు ప్రయత్నించి కాలువలో పడ్డాడు. ఇలా ముగ్గురు కాలువలో కొట్టుకుపోతుండడాన్ని గమనించిన స్థానికులు పెద్దగా కేకలు పెట్టారు. అయితే అదే సమయంలో స్థానికంగా ఉంటున్న చాయా బాయి అనే మహిళ అటుగా వచ్చింది.

కాలువలో కొట్టుకుపోతున్న ముగ్గుర్ని చూసింది. వెంటనే ఇక ఏ మాత్రం ఆలోచించకుండా వారిని రక్షించేందుకు ముందుకు దూకింది. చుట్టూ అందరూ ఉన్నారు, తాను మహిళ అని కూడా చూడకుండా ఒంటిపై ఉన్న చీరని తీసి కాలువలోకి విసిరింది. దీంతో ఆ చీరను పట్టుకున్న ముగ్గురూ బయటికి వచ్చారు. వారిని లాగేందుకు ఒడ్డున ఉన్న ఇతర వ్యక్తులు కూడా సహాయం చేశారు. ఈ క్రమంలో చాయా బాయిని అందరూ అభినందించారు. చీరను విసిరి ముగ్గురి ప్రాణాలను కాపాడినందుకు ఆమెను స్థానికులు వేనోళ్ల పొగిడారు. ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఆ మహిళ అలా తోటి వ్యక్తుల్ని రక్షించింది. ఈమె సాహసాన్ని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే...

ఇది కూడా చదవండి: ఆ పెట్రోల్ బంక్ కి బికినీలో వెళ్తే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఫ్రీ!

ఇది కూడా చదవండి: అలాంటి సినిమాలు చూడొద్దంటున్న శృంగార తార!

ఇది కూడా చదవండి: 'జనతా' పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

English summary

A woman saved 3 people with her saree