విద్యుత్ స్తంభం ఎక్కి పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ!

A woman shows stars to police

11:45 AM ON 24th September, 2016 By Mirchi Vilas

A woman shows stars to police

బంధువులతో తగాదా జరగడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ సమీపంలోని విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపునకు పాల్పడింది. ఏకంగా మూడు గంటలపాటు సాగిన ఈ తతంగంలో సదరు మహిళ అందరికీ చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుప్పూర్ లో కుమార స్వామి, సంగీత(23) అనే దంపతులు నివసిస్తున్నారు. కుమార స్వామి ఇంటికి 16 అడుగుల బాట వుంది. ఆ దారిలో స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ పొందేందుకు పైపులు అమర్చే పనులను కుమారస్వామి చేపట్టారు. ఈ పనులను స్థలం యజమానులైన కుమారస్వామి బంధువులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి అధికారులకు కుమారస్వామి ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు స్పందించలేదు.

బంధువులతో ఏర్పడిన తగాదా వల్ల మనస్తాపం చెందిన సంగీత గురువారం సాయంత్రం సమీపంలో వున్న హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి కత్తితో గొంతు కోసుకుంటానని బెదిరించసాగింది. దీనిపై స్థానికులు అందజేసిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంగీతను కిందికిదిగి రావాలని కోరారు. తమ విద్యుత్ కనెక్షన్ ను అడ్డుకోమని బంధువులు లిఖిత పూర్వకంగా రాసిస్తేనే దిగుతానని తెలిపింది. పోలీసుల జోక్యంతో బంధువులు పనులను ఆటంకపరచమని రాసివ్వడంతో ఆమె కిందికి దిగివచ్చింది. ఆమెను ఒప్పించేందుకు పోలీసులు సుమారు రెండు గంటలు శ్రమించారు.

English summary

A woman shows stars to police