స్మగ్లింగ్ సరుకు ఈమె ఎక్కడ దాచిందో తెలిస్తే షాకౌతారు!

A woman smuggled cocaine in her private place

04:20 PM ON 19th July, 2016 By Mirchi Vilas

A woman smuggled cocaine in her private place

ఓ మహిళ చేసిన సాహసం కస్టమ్స్ అధికారులనే ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు ఒక కేజీ బరువుండే కొకైన్ ను తన వక్షోజాల లోపల దాచి సులభంగా స్మగ్లింగ్ చేసేద్దామనుకుంది. అయితే జర్మనీ కస్టమ్స్ అధికారులు ఆమె గుట్టు రట్టు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. వారం క్రితం కొలంబియాకు చెందిన ఓ యువతి జర్మనీ ఎయిర్ పోర్ట్ లో దిగింది. రెగ్యులర్ చెకింగ్ కోసం కస్టమ్స్ అధికారులు ఆ యువతిని మహిళా అధికారుల దగ్గరకు పంపించారు. వారు కింద నుంచి పై వరకు మొత్తం తనిఖీ చేస్తూ ఆమె వక్షోజాలపై ఉన్న కుట్లును(Stitches) చూసి అనుమానపడ్డారు.

ఆమె బ్రా విప్పించి వక్షోజాలపై చేతులు పెట్టగా.. ఆమె నొప్పితో విలవిల్లాడింది. దీంతో జర్మనీకి బయల్దేరే గంట ముందే ఆమె ఆపరేషన్ చేయించుకుని ఉంటుందని భావించి ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ఆమెకు శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు ఆమె చెరో వక్షోజం నుంచి 500 గ్రాముల కొకైన్ ను బయటకు తీశాడు. కొకైన్ ను ప్లాస్టిక్ గా మార్చి ఆమె వక్షోజాల్లో పెట్టి కుట్టేశారు. వీటి విలువ 2,20,000 డాలర్లు(అంటే దాదాపు కోటీ 47 లక్షల రూపాయలు) ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇలాంటి స్మగ్లింగ్ కేసు జర్మనీలో దొరకడం ఇదే మొదటిసారి అని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

కాగా, తాను కొలంబియాలో ముగ్గురు పిల్లలకు తల్లినని, సాధారణ రైతు కూలీనని ఆ యువతి వెల్లడించింది. ఆమెను అరెస్ట్ చేసి ఆమెపై డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులు నమోదు చేశారు.

English summary

A woman smuggled cocaine in her private place