రైలు ప్రమాదానికి గురైన వ్యక్తిని.. చీర విప్పేసి కాపాడిన మహిళకు సత్కారం!

A woman taken a man to the hospital with her saree

12:34 PM ON 17th October, 2016 By Mirchi Vilas

A woman taken a man to the hospital with her saree

మానవత్వం కన్నా మించినది ఏమీ లేదని భావించిన ఆమె చేసిన చిన్న సాయం ఇప్పుడామెకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. రైలు ప్రమాదంలో కాలు కోల్పోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రైల్వే ఉద్యోగిని ఆస్పత్రికి తరలించేందుకు స్ట్రెచర్ లేకపోవడంతో ఆమె క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన చీరనే స్ట్రెచర్ గా మార్చేసి మానవత్వాన్ని చాటింది. మహారాష్ట్రలోని థానెలో సెప్టెంబరు 27న ఈఘటన జరిగింది. రైల్వే ఉద్యోగి విష్ణు కిరాజి అండాలె వాషిండ్ రైల్వే స్టేషన్ లో గ్యాంగ్ మ్యాన్ పనుల్లో ఉండగా వేగంగా వచ్చిన రైలు అతడి పైనుంచి దూసుకుపోయింది. ప్రమాదంలో విష్ణు రెండు కాళ్లు కోల్పోయి రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

పట్టాల మధ్యలో పడిపోయిన ఆయనను అందరూ చోద్యం చూస్తున్నారు కానీ ఒక్కరికి కూడా ఆస్పత్రికి తరలించాలన్న ఆలోచన రాలేదు. అదే సమయంలో కల్యాణ్ రైల్వే ఆస్పత్రిలో పనిచేస్తున్న మనీషా షిండే ఆ మార్గం గుండా వెళ్తూ బాధితుడిని చూశారు. విషయం తెలుసుకుని ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే అక్కడ స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే కట్టుకున్న చీరను విప్పేసి దానినే స్ట్రెచర్ గా మార్చి ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ తర్వాత మృతి చెందాడు.

మనీషా చేసిన సాహసం గురించి తెలిసిన థానె సిటీ మేయర్ సంజయ్ మోరె శుక్రవారం ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మనీషా తాను చేసిన సాయంతో సమాజంలోని ఎందరికో స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో బాధితులకు సాయం అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.

English summary

A woman taken a man to the hospital with her saree