డబ్బు వద్దని 13 లక్షలు పడేసింది.. ఎక్కడో తెలుసా?

A woman thrown 13 lakhs money on road

01:57 PM ON 26th March, 2016 By Mirchi Vilas

A woman thrown 13 lakhs money on road

ఈ రోజుల్లో డబ్బు అవసరం లేని వారు ఎవరు ఉండరు. అసలు లోకంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే దానికి డబ్బే కారణం. డబ్బుంటే మన శత్రువులు కూడా మన పై ప్రేమని చూపిస్తారు. ఈ లోకంలో డబ్బు ఉన్న వాళ్ళదే రాజ్యం. డబ్బు ఉంటేనే మనల్ని గౌరవిస్తారు. డబ్బు కోసం చెయ్యని నీచమంటూ లేదు. డబ్బే సర్వస్వం అనుకుని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు వినబోయే సంఘటన వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. ఓ మహిళ తనకు డబ్బు అక్కర్లేదని దాదాపు 20 వేల డాలర్ల(13 లక్షల రూపాయలు)ను నడిరోడ్డు మీదకు విసిరేసింది.

ఇది కూడా చదవండి :పరీక్ష హాల్లో అమ్మాయిలని అక్కడ చెక్ చేస్తున్నారు(వీడియో)

ఏంటి ఆమె పిచ్చిది అనుకుంటున్నారా? లేక అవి నకిలీ డబ్బు అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలు వేసినట్లే. నిజంగా ఆమెకు డబ్బు అవసరం లేదనే పడేసింది. అయితే అంత డబ్బు రోడ్డు మీద పడి ఉన్నా ఆ డబ్బును గమనించి వారు తమకు కూడా అక్కర్లేదని పక్కకు తప్పుకుని వెళ్లిపోయారు పాదచారులు. ఈ సంఘటన ఇతర దేశాల వారికి ఆశ్చర్యం కలిగించొచ్చేమో కానీ, దక్షిణ కొరియా వాసులకు మాత్రం ఆశ్చర్యం కలిగించే వార్త కాదు. ఎందుకంటే దక్షిణ కొరియా(South Korea) చట్టం ప్రకారం ఉద్దేశ పూర్వకంగా దొంగతనం చేయడమే కాదు.. తమది కాని వస్తువును తీసుకున్నా వారికి శిక్ష తప్పదు. అందుకే ఎవరూ ఆ డబ్బుని ముట్టుకోలేదు.

ఇది కూడా చదవండి : ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత కాలం ఆగాలి..?

అయితే ఇంతకీ ఆ మహిళ డబ్బు ఎందుకు పడేసిందో తెలీదు కదా? ఆ మహిళ పేరిట బ్యాంకులో ఉన్న ఆ డబ్బు కోసం ఆమె కొడుకు, భర్త కొన్నాళ్లగా వేధిస్తున్నారట. అందుకే వాళ్ళకి ఆ దక్కడం ఇష్టం లేక.. కష్టాల్లో ఉన్న వారికి అందిద్దామనే ఉద్దేశంతో ఇలా రోడ్డు మీద పడేసిందట. అది అసలు సంగతి. మొత్తానికి దక్షిణ కొరియా లో చట్టం అద్భుతం కదా... ఈ చట్టం మన దేశంలో కూడా వస్తే బాగుంటుంది కదూ..

ఇది కూడా చదవండి : మార్నింగ్ సెక్స్.. ఎందుకు బెస్ట్..

English summary

A woman thrown 13 lakhs money on road. A woman in South Korea thrown 13 lakhs money on road for don't need her.