50 రూపాయలతో కోటి రూపాయలు సంపాదించింది

A woman won 1 crore lottery with 50 rupees ticket

03:21 PM ON 15th July, 2016 By Mirchi Vilas

A woman won 1 crore lottery with 50 rupees ticket

'ఛాలెంజ్' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి 25 పైసలతో 5 లక్షలు సంపాదిస్తాడు. సరిగ్గా అలానే ఒక యువతి 50 రూపాయలతో కోటి రూపాయలు సంపాదించింది. ఏంటీ నమ్మశక్యంగా లేదా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. తిరువనంతపురం జిల్లా కిలిమనూరు గ్రామంలో ఉంటున్న నబీసా రబ్బరు తోటలో కూలీగా పనిచేస్తుంది. ఏదో రోజు దేవుడు కరుణించకపోతాడా అని నబీసా లాటరీ టిక్కెట్లు కొంటూ ఉండేది. ఆమె కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. తల్లికి ఆరోగ్యం సరిగా లేదు, ఓ ప్రమాదంలో ఆమె చెల్లెలి కాలు పోయింది. నబీసా జీవితం అతి కష్టం మీద గడుస్తోంది. అందుకే కాస్త డబ్బు పోగేసి లాటరీ టిక్కెట్లు కొంటూ ఉండేది.

ఆమెను అదృష్ట దేవత కొద్ది కొద్దిగా కరుణిస్తూ ఉండేది. గతంలో రెండుసార్లు 5 వేలు, చాలాసార్లు రూ.1,000 చొప్పున గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా 1 కోటి రూపాయలు గెలుచుకుంది. ఈ లాటరీ టిక్కెట్ ను ఆమె రూ.50తో కొనింది. తాను గెలుచుకున్న కోటి రూపాయలతో తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటానని ఆమె చెప్పింది. తన కుటుంబం కష్టాలన్నీ తీరిపోయినట్లేనని సంతోషిస్తుంది. కాలు పోగొట్టుకున్న చెల్లెలి చేత స్టేషనరీ షాప్ పెట్టిస్తానని చెప్పారు. కేరళ ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో ఓ లాటరీని నిర్వహిస్తోంది. ఏటా రూ.100 కోట్ల చొప్పున ఈ లాటరీ ద్వారా సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

English summary

A woman won 1 crore lottery with 50 rupees ticket