సెక్స్ కు ఒప్పుకోలేదని యువకుడి పై మహిళ యాసిడ్ తో దాడి

A women attacks on man with acid

04:04 PM ON 17th May, 2016 By Mirchi Vilas

A women attacks on man with acid

రోజురోజుకి ఆడవాళ్ళ పై అత్యాచారాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి అనుకుంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మగాళ్ళ పై అఘాయత్యాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.. ఉత్తరప్రదేశ్‌లో మధ్య వయసు మహిళ తన కోరికను కాదన్నాడనే కారణంతో ఓ స్థానిక యువ డాక్టర్ పై యాసిడ్ తో స్నానం చేయించింది. ఘజియాబాద్ జిల్లాలో వైశాలిలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. వైశాలికి చెందిన ఓ మహిళ(45).. పశువుల డాక్టర్ అయిన అమిత్ వర్మ(28)తో అక్రమ సంబంధాన్ని కోరుకున్న మహిళ గత కొన్నిరోజులుగా అతణ్ని వేధిస్తోంది.

ఆమె కోరికను డాక్టర్ తిరష్కరించడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వెటర్నరీ డాక్టర్ అమిత్.. కుక్కల కోసం స్థానికంగా ఒక క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగు లీటర్ల యాసిడ్‌తో క్లినిక్‌కు వచ్చిన ఆమె.. అమిత్ కి యాసిడ్ తో స్నానం చేయించి పారిపోయింది. తీవ్ర గాయాలపాలైన అమిత్‌ను అతని స్నేహితుడు దీపక్ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితునికి నలభై శాతం గాయాలయ్యాయని పొట్ట మీద, ఛాతి పైన తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలియజేసారు.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు..

English summary

A women attacks on man with acid. A 45 years woman attacks on 28 years man with acid..