పోలీసుల తీరు నిరసిస్తూ.. బిల్డింగ్ ఎక్కిన మహిళ

A women attempted suicide for police behaviour

11:46 AM ON 1st July, 2016 By Mirchi Vilas

A women attempted suicide for police behaviour

తనను పోలీసులు వేధిస్తున్నారంటూ ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో కుటుంబసభ్యులతో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ ఆఫీసు బిల్డింగ్ పైకి ఎక్కి కిందకు దూకుతానంటూ బెధిరించింది. అయితే స్థానికుల సాయంతో పోలీసులు వారిని కిందకు దించారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా నాగమణి అనే మహిళకు చెందిన బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని తీసుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్ళినపుడు, సిబ్బంది దురుసుగా మాట్లాడారని నాగమణి ఆరోపణ. ఈ అవమానం భరించలేకే కుటుంబసభ్యులతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆమె తెలిపింది.

గుడివాడ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపించి, చర్యలు చేపట్టాలని స్ధానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

English summary

A women attempted suicide for police behaviour