బస్సులో దొంగకి కాలితో కిక్ ఇచ్చిన మహిళ(వీడియో)

A women gives a leg kick to thief in China

11:41 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

A women gives a leg kick to thief in China

చైనాలో బస్సులో పర్స్ దొంగతనం చేయాలనుకున్న దొంగకి యువతి చుక్కలు చూపించింది. రద్దీగా ఉన్న బస్సులో ఓ యువతి తన ఫోన్‌తో బిజీగా ఉంది. అదే సరైన సమయంగా భావించి హ్యాండ్ బ్యాగ్ లక్ష్యంగా చేసుకొని ఓ దొంగ చోరీ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, అంతలోనే బస్సు స్టాప్ రావడంతో కొందరు ప్రయాణికులు దిగిపోయారు. అయినా ఆ దొంగ తన ప్రయత్నాన్ని ఆపలేదు. సరిగ్గా హ్యాండ్ బ్యాగ్ లో చేయి పెట్టే సమయంలోనే యువతి గమనించి అందిరినీ పిలవడానికి ప్రయత్నించింది. అంతలోనే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న దొంగ పై తన కరాటే స్కిల్స్ చూపించింది ఆ యువతి. సెకన్లలోనే అతన్ని కుప్పకూలేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది.

English summary

A women gives a leg kick to thief in China. A china woman gave a karate kick to thief in bus.