మంచులో కూరుకుపోయిన కారులో ఏముందో తెలుసా

A women inside the car got buried in Fog

11:33 AM ON 19th December, 2016 By Mirchi Vilas

A women inside the car got buried in Fog

ఆ కారుని మంచులో కూరుకుపోయేలా అసలు ఎవరు ఎందుకు అలా చేశారో ఏమో గాని, మొత్తానికి ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్ న్యూయార్క్ పోలీసులను పరుగులు పెట్టించింది. ఆ కారులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించిన వారు ఎట్టకేలకు అసలు విషయం తెలుసుకుని ఖంగుతిన్నారు. వారికీ కొంచెం సేపు నోట మాట రాలేదు. అసలు ఆకూరులో ఏముందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. హడ్సన్ సిటీలో ఆగి ఉన్న ఓ కారు దాదాపు మంచులో కూరుకుపోయింది. ఆ కారులో ఓ మహిళ గడ్డ కట్టుకుపోయి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోందంటూ ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి పోలీసులకు సమాచారం అందింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ మంచులో కూరుకుపోయిన ఓ కారు కనిపించింది.

సుమారు మైనస్ 13 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉన్న సమయంలో రాత్రి వేళ ఆ కారు ఎవరో వదిలివెళ్లినట్టు పోలీసులు వెంటనే గ్రహించారు. అద్దాలు పగులగొట్టి చూసారు. పాసింజర్ సీటులో ఆక్సిజన్ మాస్క్ ధరించి చలనం లేకుండా ఉన్న ఓ ఆకారం కనిపించింది. ఆ ఆకారం సీటు బెల్టు కూడా ధరించింది. అయితే ఆ ఆకారం మనిషి కాదని, అచ్చం మనిషిని పోలినటు బొమ్మ అని తెలుసుకుని పోలీసులు షాకయ్యారు. మనిషి తరహాలోనే ఆ బొమ్మకు దుస్తులు, కళ్లజోడు, షూలు వేసి ఉన్నాయి. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకున్న పోలీసులు సదరు కారు యజమాని ఆచూకీ తెలుసుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే పోలీసు చర్యపై ఆ యజమాని ఫిర్యాదు చేయడం. మెడికల్ ట్రైనింగ్ పరికరంగా ఆ బొమ్మను తాను ఉపయోగించుకునేవాడినంటూ కారు ఓనర్ చెప్పడంతో పోలీసులు మరోసారి అవాక్కయ్యారు.

English summary

A women in the city New york buried in Fog with her car and fortunately a stranger called cops and informed them.