అమ్మతనానికే మచ్చ తెచ్చిన సంఘటన.. కన్నబిడ్డల్ని టవల్ లో పెట్టి..

A women killed 8 children in Berline

06:28 PM ON 26th July, 2016 By Mirchi Vilas

A women killed 8 children in Berline

అమ్మ అంటే కనిపించే దైవం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ భాషైనా, ఏ దేశమైనా అమ్మతనానికి మాత్రం బేధాలు లేవు.. అలాంటి అమ్మతనానికి మచ్చ తెచ్చింది ఓ కఠినాత్మకరాలు. ఆ వివరాల్లోకి వెళితే.. ఒళ్లు గగురు పుట్టించే ఈ ఘటన బెర్లిన్ లో చోటుచేసుకుంది. ఆండ్రియా(45), జోహాన్(54) దంపతులకు వివాహమైన మూడేళ్లలో ఇద్దరు పిల్లలు జన్మించగా.. ఆ తర్వాత పిల్లలు వద్దనుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది.. అయితే కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలంటే ఇద్దరికీ భయంతో.. ఈ దారుణానికి ఒడి గట్టారు. కాంట్రా సెప్టివ్ పిల్స్ వేసుకోవడం ఇష్టం లేదట.

అయితే.. వారిద్దరూ తమ శారీరక వాంఛలను మాత్రం వదులుకోలేదు. ఫలితంగా ఆండ్రియా గర్భం ధరిస్తూ ఉండేది. గత 10 ఏళ్లలో 8 సార్లు గర్భవతి అయింది. ప్రసవం అయిన వెంటనే ఆ పసిబిడ్డను హ్యాండ్ టవల్ లో పెట్టి.. ఊపిరి ఆడకుండా చేసి చంపేసేది ఆండ్రియా. ఇలా 8 మంది పిల్లలను పుట్టీ పుట్టగానే చంపేసింది. ఎప్పుడూ గర్భవతిగానే కనిపించే ఆండ్రియా పిల్లలు మాత్రం బయట కనపడకపోవడంతో పక్కింటి వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆండ్రియాకు కనీసం 15 ఏళ్ళు, జోహాన్ 3 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

English summary

A women killed 8 children in Berline