అక్కడ ముగిసిన ‘అ ఆ’

A..Aa Movie Shooting Completes

10:37 AM ON 26th February, 2016 By Mirchi Vilas

A..Aa Movie Shooting Completes

యంగ్‌హీరో నితిన్, క్యూట్ బ్యూటీ సమంత, కేరళ భామలు నిత్యామీనన్, అనుపమ పరమేశ్వరన్ వంటి క్రేజీ కాంబినేషన్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అ ఆ’ (అనసూయ రామలింగం v/s ఆనంద్ విహారి) చిత్రం తమిళనాడులో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. హారిక అండ్ హాసిని బ్యానర్‌లో సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ రీసెంట్‌గా తమిళనాడులోని పొలాచ్చిలో షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు దర్శకుడు సోషల్‌మీడియా ద్వారా తెలియజేశాడు. ఈ సందర్భంగా త్రివిక్రమ్, నితిన్, సమంతలతో పాటు చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్న వారంతా కలిసి తీసుకున్న సెల్ఫీని దర్శకుడు త్రివిక్రమ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ చిత్రాన్ని ముందుగా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుల కానుకగా విడుదల చేద్దామనుకున్న ప్పటికీ కొన్ని కారణాల వలన విడుదల తేదీలో మార్పులు జరిగాయి. ఫలితంగా ఏప్రిల్ 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ్యాలని చిత్రయూనిట్ నిర్ణయించారు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

English summary