జయలలిత డెత్ సర్టిఫికెట్ లో మిస్సయిందేమిటో తెలుసా

Aadhaar Number Missed In Jayalalitha Death Certificate

11:07 AM ON 7th December, 2016 By Mirchi Vilas

Aadhaar Number Missed In Jayalalitha Death Certificate

పురచ్చి తలైవిగా పేరొందిన జయలలిత అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఇక ఆమె జ్ఞాపకాలే మిగిలాయి. తమిళనాడు ప్రజలకు అన్నీ తానై ‘అమ్మ’గా పేరు గాంచిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత సోమవారం మృతి చెందినట్లు చెన్నై అపోలో వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ జయలలిత డెత్ సర్టిఫికెట్ ను మంగళవారం ఉదయం 11 గంటలకు జారీ చేసింది. 2016 డిసెంబర్ 5న రాత్రి 11.30కి 68 ఏళ్ల జయలలిత మృతి చెందినట్లు అందులో పేర్కొన్నారు. అయితే అందులో ఓ కీలక విషయం మరిచారు. జయలలిత అమ్మగారు జె. సంధ్య, నాన్నగారు ఆర్. జయరామ్ అని డెత్ సర్టిఫికెట్ లో ఉంది. చెన్నై పోయెస్ గార్డెన్ లోని వేద నిలయంలో నంబర్ 18 ఇంట్లో జయలలిత నివాసమున్నట్లు అందులో పేర్కన్నారు. అయితే జయలలిత డెత్ సర్టిఫికెట్ లో ఆమె ఆధార్ నెంబర్ ను పొందుపరచలేదు.

ఇవి కూడా చదవండి: తమిళ ప్రజల పాలిట అమ్మ... జయలలిత ప్రస్థానం!

ఇవి కూడా చదవండి: వాట్సాప్ లో కొత్తగా రెండు ఫీచర్స్!

English summary

Tamilnadu Chief Minister Jaya Lalitha was struggled for many days in Tamilnadu Apolo Hospital and She died on 5th December. Now a news came to know that Jaya Lalitha's Aadhar Number was missed in the Death Certificate.