ఆది బ్యాంకాక్‌ లో ఏం చేస్తున్నాడు ?

Aadi film shooting in Bangkok

12:30 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Aadi film shooting in Bangkok

యంగ్‌ హీరో ఆది నటిస్తున్న తాజా చిత్రం చుట్టాలబ్బాయి. ఈ సినిమాలో నమిత ప్రమోద్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి మూవీ హౌస్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి వీరభద్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తరవాత షెడ్యూల్‌ జనవరి 29 న బ్యాంకాక్‌ లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌ లో హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని చిత్రీకరిస్తారు. ఈ పాటకి శేఖర్‌ మాస్టర్‌ నృత్య దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ పాటతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా బ్యాంకాక్‌ లో చిత్రీకరించనున్నారు. తర్వాత షెడ్యూల్‌ ఫిబ్రవరి 18 నుంచి హైదరాబాద్‌ లో జరగనుంది. తరవాత మార్చి 2 నుంచి 20 వరకు రాజమండ్రిలో జరిగే షెడ్యూల్‌ తో ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది. ఈ సినిమాకి థమన్‌ సంగీత దర్శకుడు. ఈ సినిమా గురించి దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టినీ ఆకట్టుకునే విదంగా చిత్రీకరించాము అని తెలిపారు. థమన్‌ చాలా మంచి ట్యూన్స్‌ను అందించాడు. ఈ సినిమా ఆదికి, నాకు తప్పకుండా పెద్దహిట్‌ అవుతుందని చెప్పాడు.

English summary

Veera Bhadram is directing this film. Meanwhile, the latest schedule related to this film will start from January 29 in Bangkok. Some key scenes will also be filmed in this schedule