ఎన్టీఆర్ 'ఆది' కి ఖర్చు పెట్టింది, వచ్చింది ఎంతో తెలుసా?

Aadi movie cost and collections

05:00 PM ON 17th May, 2016 By Mirchi Vilas

Aadi movie cost and collections

యంగ్ టైగర్ ఎన్టీఆర్-వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'ఆది'. కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించాడు. ఎన్టీఆర్ ని ఓవర్ నైట్ స్టార్ హీరోని చేసింది ఈ చిత్రమే. అంతకు ముందు ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన 'స్టూడెంట్ నెం. 1' చిత్రం హిట్ అయినా ఎన్టీఆర్ ని పూర్తిగా మాస్ ఆడియన్స్ లోకి తీసుకు వెళ్ళలేదు. అలా మాస్ లోకి వెళ్లిపోవాలి అంటే పూర్తి మాస్ సినిమాతో హిట్ కొట్టాలి.. అప్పటికి నందమూరి బాలకృష్ణ కి మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు చిత్రాలతో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు బాలకృష్ణ.. ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చిరంజీవి కి కూడా లేదు.

అయితే ఎన్టీఆర్ మాస్ కధ కోసం ఎదురు చూస్తున్న టైంలో డైరెక్టర్ వినాయక్ ఎన్టీఆర్ కు పరిచయం అయ్యాడు. వినాయక్ ఎన్టీఆర్ లు కలిసి 'ఆది' చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేయగా రిలీజ్ అయ్యిన అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాక్ ని సంపాదించుకుంది. 'ఆది' చిత్రం 121 సెంటర్స్ లో 50 రోజులు, 96 సెంటర్స్ లో 100 రోజులు, 3 సెంటర్స్ లో 175 రోజులు పూర్తి చేసుకుని దాదాపు 25 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి టాలీవుడ్ లో ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి పెట్టిన ఖర్చు కేవలం 2 కోట్లు మాత్రమే. ఈ చిత్రంలో తొడ కొట్టడం, సుమోలు గాలిలోకి లేవడం వంటి సన్నివేశాలు మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి..

English summary

Aadi movie cost and collections. Young Tiger Ntr super hit movie Aadi movie cost and collections.