రేషన్ కార్డు కోసం మహిళ వెళ్తే.. ఆప్ మంత్రి ఎం చేసాడో తెలుసా?

Aam Aadmi party minister teased a woman

06:32 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Aam Aadmi party minister teased a woman

రాజకీయాల్లో పెను మార్పులు తెస్తామని చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు వరుస వివాదాల్లో కూరుకుపోతోంది. సాక్షాత్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించే మంత్రి మహిళల పట్ల నీచంగా వ్యవహరించాడు. ఇది కాస్తా బట్టబయలు అయింది. ఇప్పుడు మంత్రి సందీప్ కుమార్ రాసలీలల సీడీల వ్యవహారంలో కొత్త కోణం బయటకు వచ్చింది. సీడీలో కనపడిన మహిళ సంచలన ఆరోపణలు చేసింది. రేషన్ కార్డ్ కోసం వెళ్లిన తనకు కూల్ డ్రింక్ లో మత్తు కలిపి ఆ తర్వాత తనపై మంత్రి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. దీనికి సంబంధించి ఢిల్లీ సుల్తాన్ పూరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమె ఫిర్యాదు చేశారు.

పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు తమ తదుపరి కార్యాచరణలో పడ్డారు. రాసలీలల సీడీ బయటపడగానే మంత్రి పదవి నుంచి సందీప్ ను తొలగించిన, నేపథ్యంలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సందీప్ ను తొలగించారు. ఇంకా ఇలాంటి ఉద్ధండులు ఇంకా ఎవరెవరు ఆపార్టీలో వున్నారోనని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.

ఇది కూడా చదవండి:ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

ఇది కూడా చదవండి:న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది?

ఇది కూడా చదవండి:హైట్ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే

English summary

Aam Aadmi party minister teased a woman