కాలం చెల్లిన  'అమీర్' 

Aamir Khan to no longer say Athiti Devo Bhava

02:51 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Aamir Khan to no longer say Athiti Devo Bhava

అవును, కేంద్ర ప్రభుత్వ ‘‘ఉజ్వల భారత్‌’’ ప్రచార కార్యక్రమంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమీర్‌ ఖాన్‌ ఇక కనిపించరని తేలింది. అమీర్ తో కుదుర్చుకున్న ఒప్పందానికి కాలం చెల్లడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు 'అతిధి దేవో భవ' అంటూ ప్రమోట్ చేసిన అమీర్ ను ప్రచారకర్తగా తొలగిస్తున్నట్లు కేంద్రం స్పష్టంచేసింది. ‘‘గతంలో ‘అతిథి దేవో భవ’ ప్రచారం కోసం మెక్‌కాన్‌ వరల్డ్‌వైడ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ సంస్థే ఆమీర్‌ను ప్రచారకర్తగా నియమించింది. అయితే ఇప్పుడు ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందానికి కాలం చెల్లింది’’ అని కేంద్ర పర్యటక మంత్రి మహేశ్‌ శర్మ వెల్లడించారు. దీంతో ప్రచారకర్తగా ఆమీర్‌ను తొలగిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఉజ్వల భారత్‌లో అతిథి దేవో భవ కూడా ఒక భాగం. దీన్ని యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారు. ప్రచారం నుంచి ఆమీర్‌ను తొలగించడం ద్వారా మోదీ ప్రభుత్వ సంకుచిత ఆలోచనా ధోరణి, ప్రాంతీయ వైషమ్యాలు బయటపడ్డాయని కాంగ్రెస్‌ సమాచార విభాగం అధినేత రణ్‌దీప్‌ సుర్జేవాలా వ్యాఖ్యానించారు.

కాగా ఇటీవల అసహనంపై ఆమీర్‌ గళమెత్తి, వివాదానికి తెరలేపారు. దీనిపై సోషల్ మీడియాలో అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు రాజ్యమేలాయి. బిజెపి శ్రేణులు , సినీ నటులు సైతం అమీర్ తీరుని తప్పుబట్టారు. అయితే ఉద్దేశ్య పూర్వకంగానే ఇప్పుడు అమీర్ ని ప్రచార కర్త గా తొలగించారని కాంగ్రెస్ తో పాటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయం లేదని , గడువు ముగియడంతో తొలగింపు జరిగిందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి అమీర్ వ్యవహారం మరోసారి తెరమీదికి వచ్చింది.

English summary

Bollywood Hero Mr.Perfect Aamir Khan to no longer say Athiti Devo Bhava.His contract for central governments Athiti Devo Bhava campaign was expired today.Today central government was no longer extend his contract