'3 ఇడియట్స్' సీక్వెల్ చేస్తానంటున్నఅమీర్‌

Aamir Khan want to act in 3 Idiots sequeal

06:44 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Aamir Khan want to act in 3 Idiots sequeal

2009లో విడుదలైన '3 ఇడియట్స్‌' సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు పొందింది. అమీర్‌ఖాన్‌ హీరోగా నటించిన ఈ సినిమాకి రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వం వహించాడు. రాజ్‌కుమార్‌ దేశంలోనే గొప్ప డైరెక్టర్‌గా పేరు పొందాడు. రాజ్‌కుమార్‌ సామాజిక సమస్యలను తన సినిమాలలో హైలెట్‌ చేస్తూ ఉంటాడు. సామాజిక సమస్యలను ప్రస్థావిస్తూనే సినిమాను ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కిస్తాడు. ఈ విధంగా కొంతమంది దక్శకులు మాత్రమే చెయ్యగలరు. 'బాహుబలి' సినిమా చిత్రీకరించిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా రాజ్‌కుమార్‌ కి అభిమాని.

ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో అమీర్‌ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరానీ అమీర్‌ ను కలిసి '3 ఇడియట్స్‌' సీక్వెల్‌ తీద్దామని చెప్పాడని తెలియజేసాడు. అంతా సవ్యంగా జరిగితే 3 ఇడియట్స్‌ సీక్వెల్‌ సినిమా వెండితెర పై కనపడుతుంది.

English summary

Aamir Khan want to act in his super hit movie '3 Idiots' sequeal. This movie is directed by RajKumar Hirani. Now he wants to direct sequeal for this film. Aamir Khan is ready to act in this sequeal.