మోడీ అంటే అంతే మరి-ముగ్గురు ఖాన్లు ఒకే వేదికపై..

Aamir Shahrukh Salman Khan's to Reunite for Modi

10:37 AM ON 30th April, 2016 By Mirchi Vilas

Aamir Shahrukh Salman Khan's to Reunite for Modi

బాలీవుడ్ లో అమీర్ ఖాన్.. షారూక్ ఖాన్.. సల్మాన్ ఖాన్ ముగ్గురు ఒకే సినిమాలో నటిస్తే..? ఈ కల కోట్లాదిమంది సినీ అభిమానులలోనే కాదు, ఎంతోమంది డైరెక్టర్లకూ ఉంది. ఈ కాంబినేషన్ సెట్ చేయాలని ఎంతగానో ట్రై చేశారు కానీ వర్క్ వుట్ అవ్వలేదు. కనీసం ఈ ముగ్గురు ఖాన్లు ఒకే వేదిక మీద కనిపిస్తే చాలు అనుకునే వారు చాలామందే ఉన్నారు.అదీ.. కుదరలేదు. కానీ.. అలాంటి పని తాజాగా ప్రధాని మోడీ చొరవతో అవుతోంది. ఇక అభిమాన జనానికి పండగే పండగ.

ఇవి కూడా చదవండి: టిటిడి పై ముగ్గురు ఎంపిల కన్ను

వివరాల్లోకి వెళ్తే, ఈ ముగ్గరు ఖాన్లను ఒకే వేదికపైకి తేవడం అసాధ్యమనుకునే విషయాన్ని చాలా సింఫుల్ గా ప్రధాని మోడీ పూర్తి చేశారు. దీంతో ముగ్గురు ఖాన్లను ఒకే వేధిక మీద చూసే అవకాశం కలగనుంది. ఇంతకీ అదెలా అంటే, మోడీ సర్కారు కొలువు తీరి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఢిల్లీ గేట్ దగ్గర..‘‘జరా ముస్కురా దో’’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రయాక్తగా హాజరు అవుతున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి: ఉద్యోగం పీకేసారని విమానం ధ్వంసం చేశాడు(వీడియో)

ఇక.. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమీర్ ఖాన్.. షారూక్ ఖాన్.. సల్మాన్ ఖాన్లు హాజరు కానుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ముగ్గురు ఖాన్లు మాత్రమే కాదు.. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల్ని కేంద్ర పౌరసంబంధాల శాఖ ఆహ్వానించింది. ప్రముఖులతో పాటు.. ఈ సభకు దాదాపు 60వేల మంది హాజరు కానున్నట్లు చెబుతున్నారు. ఈ భారీ కార్యక్రమం ప్రజల మనసుల్లో నిలిచిపోవటం ఖాయమని అంటున్నారు. మొత్తానికి ఓ అద్భుత దృశ్యం ఆవిష్కారం కానుంది.

ఇవి కూడా చదవండి: చ ... చ ..13ఏళ్ల బాలికలకు కన్యత్వ పరీక్షలు చేసి మరీ ...

ఇవి కూడా చదవండి: ఐస్ క్రీం వల్ల పెళ్లి ఆగిపోయింది

English summary

Bollywood Top Heroes Salman Khan,Shah Rukh Khan,Aamir Khan to appear in one stage because of Narendra Modi. Modi was invited these three along with many of the celebrities to Participate in an Event Named "Jara Muskurado".