అంతరిక్షంలో అమీర్ అడుగు

Aamir to play astronaut Rakesh Sharma in his next film

11:44 AM ON 9th June, 2016 By Mirchi Vilas

Aamir to play astronaut Rakesh Sharma in his next film

అవునా, భారత వ్యోమోగాములు అంతరిక్షంలోకి అడుగు పెట్టడం మనకు తెలుసు. కానీ ఓ బాలీవుడ్ హీరో అందునా అమీర్ ఖాన్ అడుగు పెట్టాడా అయితే అది పెద్ద వార్తే కదా. ఆచితూచి సబ్జెక్ట్ ఎంచుకుని దానిపై ఎంతదాకావెళ్లేందుకైనా సిద్దమయ్యే అమీర్ ఖాన్ కి ఇండియన్ సినిమాలో స్పెషలిస్ట్ గా గుర్తింపు తెచ్చాయి. లగాన్, త్రి ఇడియట్స్, పీకె, లేటెస్ట్ మూవీ 'దంగల్' సినిమాలు ఇందుకు నిదర్శనం. సినిమా సినిమాకి కొత్త ఎక్స్పిరిమెంట్స్, వేరియేషన్స్ చూపించే అమీర్ ఇప్పుడు ఓ అద్భుతమైన ప్రాజెక్ట్ ని తీసుకోబోతున్నాడు. అమీర్ త్వరలో ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మలా కనిపించబోతున్నాడు. అదండీ సంగతి .. ఆస్ట్రనాట్ రాకేష్ శర్మ విషయానికి వస్తే అంతరక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి. 1984 ఏప్రియల్ 3న రష్యాకు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి , బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్లాడు. ఈ ప్రయాణంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ..రాకేష్ శర్మను అక్కడనుంచి భారతదేశం నుంచి ఎలా కనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు..రాకేష్ శర్మ...సారే జహాసే అచ్చా..హిందూస్తా హమారా అని చెప్పి దేశభక్తిని చాటాడు. ఇదే అమీర్ సినిమాకి మెయిన్ పాయింట్ అయింది.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అతి పెద్ద సాహసంగా భావిస్తోన్న ఈ సినిమాలో వ్యోమగామి రాకేష్ శర్మ జీవిత చరిత్రను చూపించబోతున్నారు. దేశభక్తి ప్రధానంగా ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నారు. ఆస్కార్ ను సైతం ఈ సినిమా టార్గెట్ చేస్తుందని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం బాలీవుడ్ లో నడుస్తు్న్న బయోపిక్ ల హవాకు ధీటుగా ఈ సినిమా ఉంటుందనే హంగామా అప్పుడే మొదలైంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

ఇది కూడా చూడండి:ఐసియు లో చేరిన రజనీకాంత్... అసలు ఏమయింది ?

ఇది కూడా చూడండి:ఎక్సర్సైజ్ లతో దంచేస్తున్న ఉపాసన..

ఇది కూడా చూడండి:ఆడాళ్లు స్కర్టులు ధరించడంపై మోడీ షాకింగ్ కామెంట్స్

English summary

Bollywood top hero Aamir khan to play astronaut Rakesh Sharma in his next film.