ఆపార్టీలో ఎదగాలంటే అది వదిలేసుకోవాలట!

AAP activist who committed suicide told that to compromise body

01:02 PM ON 29th July, 2016 By Mirchi Vilas

AAP activist who committed suicide told that to compromise body

తామే అందరికి ఆదర్శమని తెగ మురిసిపోతూ జబ్బలు చరుచుకొనే ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గత వారంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి -ఆప్) మహిళా కార్యకర్త తల్లిదండ్రులు నేషనల్ కమీషన్ ఫర్ విమెన్(ఎన్ సీడబ్ల్యూ) ముందు విచారణకు హాజరై చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీలో ఎదగాలంటే - శీలంపై సర్దుకుపోవాల్సిందేనని నేతలు తన బిడ్డకు స్పష్టంగా చెప్పారని యువతి తండ్రి ఎన్డీడబ్ల్యూ చైర్ పర్సన్ లలితా కుమార మంగళం ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు. నీ శరీరంపై ప్రేమను వదులుకొని సర్దుకుపోవాలి. మేం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తేనే పార్టీలో ఎదుగుతావు అని ఆప్ నేత తన కుమార్తెను లైంగికంగా వేధించాడని ఆమె తండ్రి బోరున విలపించారు.

తన ఇద్దరు మనవరాళ్లను ఇప్పుడు స్కూలుకు కూడా రానివ్వడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు. నేతల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. కాగా ఈ కేసులో ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు దిలీప్ పాండే సహా పలువురిపై ఆరోపణలను పోలీసులు నమోదు చేశారు. ఓ ఆప్ నేతను అరెస్ట్ చేయగా, బెయిల్ పై బయటకు వచ్చారు. మహిళా కార్యకర్త తల్లిదండ్రుల ఆరోపణలను ఆప్ అధికార ప్రతినిధి దీపక్ బాజ్ పేయి ఖండించారు. ఆరోపణలు వచ్చిన వ్యక్తికి పార్టీతో సంబంధం లేదు. అతను ప్రాథమిక సభ్యుడు కాదు. కేసుతో పార్టీకి ప్రమేయం లేదు. ఢిల్లీ పోలీసులు కేసును విచారిస్తున్నారు. నిజం ఏమిటో తేలుతుంది అని అంటున్నారు. మృతురాలి పిల్లలను స్కూలుకు రానివ్వని విషయం తెలుసుకున్న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్వయంగా కల్పించుకుని పాఠశాల యాజమాన్యానికి క్లాస్ పీకారు.

English summary

AAP activist who committed suicide told that to compromise body