ఆప్ మంత్రి సోదరుని బరితెగింపు

Aap Minister Brother Misbehaviour With Woman

10:46 AM ON 9th January, 2016 By Mirchi Vilas

Aap Minister Brother Misbehaviour With Woman

కంచె చేను మేస్తే .... అనే సామెతకు అనుగుణంగా వుంది ఈ ఘటన మంత్రిని కలవడానికి పార్టీ కార్యాలయానికి వచ్చిన ఓ మహిళపై ఆయన సోదరుడు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, వేధింపులకు దిగాడు. సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. మంత్రి సోదరుడు ఇంతిలా బరితెగించిన ఘటన ఎక్కడో కాదు , దేశ రాజధాని డిల్లీలో చోటుచేస్తుకుని. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలోని హౌజ్‌రాణి ప్రాంతానికి చెందిన ఓ మహిళ రాష్ట్ర మంత్రి ఇమ్రాన్‌ హుస్సేన్‌ను కలిసేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఇమ్రాన్‌ లేకపోవడంతో ఆయన సోదరుడు ఫర్ఖాన్‌ అహ్మద్‌ను కలిసింది. సమస్యలు చెప్పుకోడానికి వచ్చిన మహిళపై ఫర్ఖాన్‌ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదన్నట్టుగా ఆమ్ ఆద్మీ నేతల తీరు కనిపిస్తోందా .....

English summary

Delhi government Aam admi party minister Imran hussains brother has mis behaved with a woman in aap office.She complained to police and police were interogating with the woman complaint