అడ్డంగా బుక్కైన ఆప్ ఎమెల్యే 

AAP MLA Booked For Misbehaving With Police Officer

03:12 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

AAP MLA Booked For Misbehaving With Police Officer

ఢిల్లీ రాజకీయాలలో తన దైన ముద్రవేసి యావత్తు దేశాన్ని ఆకర్షించిన ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) అవినీతి నిర్ములనే ప్రధాన లక్ష్యంగా ప్రజల ముందుకు వచ్చిన ఆప్ కు ప్రజల నిరాజనం పట్టి ఢిల్లి సింహాసనం ఎక్కించారు . అయితే ఈ మధ్య జరిగిన ఒక సంఘటన ఆప్ కు చెడ్డ పేరు తెచ్చేలా కనబడుతుంది.

వివరాల్లోకి వెళ్తే సరితా సింగ్ అనే ఆప్ ఎమెల్యే ఒక పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించి వార్తల్లోకి ఎక్కింది. పోలీసుల కధనం ప్రకారం ఆప్ ఎమెల్యే సరితాసింగ్ కారు డ్రైవరు దురుసుగా కారును వెనక్కి తిప్పుతూ డ్యూటీలో ఉన్న పోలీసు మోటారు బైక్ ను ఢీ కొట్టారు. దీంతో ఇదేమిటి అని అడిగిన పోలీసుకు కారు డైవరు కు మధ్య మాటల యుద్దం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన ఆప్ ఎమెల్యే సరితాసింగ్ జోక్యం చేసుకుని అసభ్య కరమైన పదజాలంతో పోలీసు అధికారిని దూషించింది.

ఈ ఉద్దాంతాన్ని అంతా విడియో తీసిన గుర్తు తెలియని వ్యక్తి ఆ విడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో సరితాసింగ్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీని పై ఆప్ ఏ విధమైన చర్య తీసుకుంటుందో వేచి చూడాలి .


/p>

English summary

AAP MLA Saritha Singh booked for misbehaving with delhi police officer. An Unknown person records the entire thing and puts it in social media,later that video went viral on social media