దిగంబర బాబా దెబ్బతో కేజ్రీవాల్ కి దిమ్మతిరిగింది

AAP MLA Vishal Dadlani Sensational Comments On Baba Tarun Sagar Maharaj

11:15 AM ON 29th August, 2016 By Mirchi Vilas

AAP MLA Vishal Dadlani Sensational Comments On Baba Tarun Sagar Maharaj

రాజకీయాల్లో అన్నీ ఒకేలా ఉండవ్. ఎత్తుపల్లాలు, పొగడ్తలు, చీత్కారాలు , మనసుని కలచివేసే ఆరోపణలు అన్నీ ఉంటాయి. అయితే ఒక్కోసారి కొందరిపై పార్టీ వ్యక్తులు గుప్పించే ఆరోపణలతో అధినేతకు తలనొప్పులు వస్తాయి. దిమ్మతిరిగిపోద్ది. సరిగ్గా ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీ వాల్ విషయంలో అదే జరిగింది. జైన దింగబర బాబా తరుణ్ సాగర్ మహరాజ్ పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. అయితే విషయం గ్రహించిన ఆప్ అగ్రనేతలు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. దిగంబర్ బాబాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు ఆప్ నేత రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు కూడా ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే, ...

హర్యానా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గత శుక్రవారం నాడు దిగంబర బాబా సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో దిగంబర్ బాబాపై గాయకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు విశాల్ దద్లానీ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొద్ది గంటల్లోనే ఆ వ్యాఖ్యలు రేపిన కలకలంతో ఆయన క్షమాపణలు చెప్పి, రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. నేను చేసిన వ్యాఖ్యలతో నా జైన్ స్నేహితులు, అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక నుంచి క్రియాశీల రాజకీయాలకు, కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా అని విశాల్ ట్వీట్ చేశారు.

అంతకు ముందు, శనివారంనాడు తరుణ్ సాగర్ బాబాపై విశాల్ ట్విట్టర్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిగంబర బాబా ఫొటో పోస్ట్ చేస్తూ ఇలాంటి వాళ్లకు ఓటు వేస్తే ఇలాంటి న్యూసెన్స్ కు మీరే బాధ్యులవుతారు. మంచి రోజులు రావు. చెడ్డ రోజులే వస్తాయి అని ట్వీట్ చేశాడు. విశాల్ వ్యాఖ్యలపై జైన మతస్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో వెంటనే స్పందించిన విశాల్ క్షమాపణలు చెబుతూ, మతాన్ని, రాజకీయాలతో మిక్స్ చేసి చూడొద్దని కోరారు. తన వ్యాఖ్యల ఉద్దేశం కూడా అదేనంటూ మరో ట్వీట్ లో వివరణ ఇచ్చారు. ఇదే క్రమంలో విశాల్ వ్యాఖ్యలను కేజ్రీవాల్ కూడా తప్పుబట్టారు.

తరుణ్ సాగర్ చాలా మంచి గురువు అని, ఆయన జైనులకే కాదు అందరికీ గురువు అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. గత ఏడాది తరుణ్ సాగర్ జీ మహరాజ్ ను తాను కలిసానని, టీవీలో ఆయన ప్రవచనాలను తన కుటుంబసభ్యులు తరచు వింటుంటారని అన్నారు. ఆయన, ఆయన ఆలోచనల పట్ల తనకెంతో గౌరవమని ఒక ట్వీట్ లో కేజ్రీవాల్ స్పందించారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.

ఇక విశాల్ వ్యాఖ్యల పట్ల ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాల్ తరఫున జైన్ లకు క్షమాపణలు చెబుతున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. 'నా మిత్రుడు విశాల్ దాద్లాని జైన్ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించినందుకు నేను క్షమాపణలు చెప్పుకుంటున్నా. ముని శ్రీ తరుణ్ సాగర్ జీ మహరాజ్ నుంచి క్షమాపణలు వేడుకుంటున్నా' అని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ట్వీట్ల అనంతరం విశాల్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ...రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:దారుణం.. అత్తమామలే పడకగది దృశ్యాలు చిత్రీకరించి.. ఆపై...

ఇవి కూడా చదవండి:పవన్ స్పీచ్ ఇస్తుంటే చిరు ఏమి చేసాడో తెలుసా?

English summary

One of the AAP MLA named Vishal Dadlani made some sensational comments of Baba Tarun Sagar Maharaj and so many people along with Aravind Kejriwal also opposed Vishal words and later Vishal Dadlani tweeted that he quits from politics.