చైల్డ్ పోర్న్ చిత్రాలపై ఉక్కుపాదం మోపిన స్వచ్ఛంద సంస్థ

Aarambh India started to remove child videos from internet

02:59 PM ON 15th September, 2016 By Mirchi Vilas

Aarambh India started to remove child videos from internet

ఇంటర్నెట్ లో మీకు చైల్డ్ పోర్నోగ్రఫీ కనిపిస్తే చాలు ఏరివేసే పని మొదలైంది. యూకే బేస్డ్ ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్(ఐడబ్ల్యూఎఫ్) భాగస్వామ్యంతో ఈ ఏరివేతకు శ్రీకారం చుట్టింది ఆరంభ్ ఇనీషియేటివ్ అనే స్వచ్ఛంద సంస్థ. సదరు వెబ్ సైట్ పై ఉక్కుపాదంమోపే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావచ్చు కూడా అంటోంది. దేశంలో పోర్న్ బారిన పడ్డ చిన్నారులను రక్షించే ఉద్ధేశ్యంతో నిర్వహిస్తోన్న ఈ నెట్ వర్క్ లో అనేకమంది వ్యక్తులు, ఆర్గనైజేషన్స్ పాలుపంచుకుంటున్నాయి. ఇంటర్నెట్ నుంచే కాకుండా చిన్నారుల్ని చైల్డ్ పోర్న్ బారినుంచి తప్పించడమే ఈ సంస్థ లక్ష్యం.

నెట్ లో చిన్నారులపై చిత్రహింసలు, చైల్డ్ పోర్న్ చిత్రాలు, లేదా వీడియోలకు సంబంధించిన దృశ్యాలు కనిపిస్తే ఆ యుఆర్ఎల్(పాత్) ను కాపీచేసి, సదరు వెబ్ సైట్ కు సమాచారం అందిస్తేచాలు. ఇక మళ్లీ ఆ కంటెంట్ ఇంటర్నెట్ లో కనబడకుండా హాట్ లైన్ సంస్థ చర్యలు తీసుకుంటుంది. ఇలా ఎవరైనా సమాచారం అందిస్తే, అలా అందించినవారి వివరాలు కూడా గోప్యంగా ఉంచి, సదరు వ్యవహారానికి కారణమైనవారిపై చర్యలు తీసుకునేలా ఆరంభ్ ప్రయత్నిస్తుంది.

aarambhindia.org పేరిట దేశంలోనే మొట్టమొదటిసారిగా చైల్డ్ పోర్న్ పై పోరుబాట పట్టిన ఈ హాట్ లైన్ సంస్థ వెబ్ సైట్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో రూపొందింది. రాబోయే కాలంలో 22 ప్రాంతీయ భాషల్లో తీసుకురాబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చైల్డ్ పోర్న్ వీడియోలు, వెబ్ సైట్స్ పై అలుపెరుగని పోరు సాగిస్తూ ఇండస్ట్రీవాచ్ డాగ్ గా(డబ్ల్యూఎఫ్) సంస్థ పనిచేస్తోంది. చాలామంది నెటిజన్లు దీన్ని స్వాగతిస్తున్నారు.

ఇది కూడా చదవండి: నాగ్ కి కాబోయే చిన్నకోడలు జగన్ బంధువేనట!

ఇది కూడా చదవండి: బట్టలు బాలేదని లోపలకి రానివ్వకుండా ఆపేసిన ఫేమస్ రెస్టారంట్!

ఇది కూడా చదవండి: వండిన ఆహారాన్ని 48 నిముషాల్లోపే తినేయాలి.. ఎందుకంటే?

English summary

Aarambh India started to remove child videos from internet. Aarambh India website started to porn videos of children from the porn websites.