ఆటాడుకుందాం రా అంటే సుశాంత్ దశ తిరిగేనా?

Aatadukundam ra movie promotional song trailer

01:05 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Aatadukundam ra movie promotional song trailer

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ లేటెస్ట్ మూవీ ఆటాడుకుందాం రా పై చాలా ఆశలే వున్నాయి. ఎందుకంటే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సుశాంత్ ఈ మూవీ కోసం వినియోగించుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పోరేషన్, శ్రీ జి ఫిలింస్ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం. హీరోయిన్ గా సోనమ్ ప్రీత్ నటిస్తోంది. చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగసుశీల నిర్మాణంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపుదిద్దుకుంది. బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ తదితరులు ఇతర తారాగణం. ఆడియో రిలీజ్ చేసిన తర్వాతిరోజు సినిమా యూనిట్ మూవీలోని జూమేగా సాంగ్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది.

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్రయత్నిస్తోన్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కొత్త ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. కాళిదాసు, కరెంట్, అడ్డా వంటి సినిమాలు చేసినా అంతగా స్టార్ డం తెచ్చుకోలేకపోయిన సుశాంత్, సోనమ్ ప్రీత్ తో జతకట్టి ఆటాడుకుందాం రా అంటూ ముందుకొస్తున్నాడు. వీళ్లిద్దరూ కలిసి ప్రేక్షకులకి ఏఆట చూపిస్తారో చూడాలి. ఇక బాహుబలిలోని చాలా సీన్స్ ని పేరడీ చేశారు. సీన్స్ మాట పక్కనబెడితే డైలాగ్స్ డబుల్ మీనింగ్ స్థాయిలో వున్నాయి. అలాగే అక్కినేని నాగేశ్వరరావు దేవదాసులోని ఎవర్ గ్రీన్ సాంగ్ పల్లెకు పోదాం.. పారుని చూద్దాం ఛలో ఛలో అనే పాటని రీమిక్స్ చేశారు. తండ్రి- కొడుకుల మధ్య ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్ సీన్స్ అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని యూనిట్ అంటోంది. ఆగస్టు 19న తెలుగు రాష్ర్టాల్లో రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ మూవీ మీద సుశాంత్ పెట్టుకున్న ఆశలు ఏమౌతాయో చూడాలి.

English summary

Aatadukundam ra movie promotional song trailer