చివరి దశలో 'ఆటాడుకుందాం రా'!

Aatadukundam Raa movie shooting is in final schedule

11:23 AM ON 15th December, 2015 By Mirchi Vilas

Aatadukundam Raa movie shooting is in final schedule

దాదాపు రెండేళ్ల తరువాత హీరో సుశాంత్‌ నటిస్తున్నా తాజా చిత్రం 'ఆటాడుకుందాం రా'. జి. నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్‌ సరసన సోనమ్‌ ప్రీత్‌ భజ్వా హీరోయిన్‌గా పరిచయమవుతుంది. సుశాంత్‌ తల్లి నాగ సుశీల మరియు చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో 60 లక్షలు పెట్టి వేసిన సెట్‌లో హీరో సుశాంత్‌, బ్రహ్మనందం పై కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. టైం మిషన్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని చెప్తున్నారు.

అఖిల్‌ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'సిసింద్రీ' చిత్రంలో ఆటాడుకుందాం రా అనే పాట నుండి ఈ సినిమా టైటిల్‌ను తీసుకున్నారు. శ్రీనాగ్‌ కోపరేషన్‌ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

English summary

Aatadukundam Raa movie shooting is in final schedule. This movie is directing by G. Nageswara Reddy and Sushanth is pairing with Sonam Preeth Bajwa.