'బాహుబలి' గా సుశాంత్‌

Aatadukundam Raa movie teaser

04:48 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Aatadukundam Raa movie teaser

'అడ్డా' తరువాత సుశాంత్‌ దాదాపు చాలా గ్యాప్‌ తీసుకుని నటిస్తున్న చిత్రం 'ఆటాడుకుందాం రా'. కామెడీ తరహా చిత్రాలు తెరకెక్కించే జి. నాగేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'పాండవుల్లో ఒకడు' ఫేమ్‌ సోనమ్‌ బజ్వా ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నటిస్తుంది. అయితే ఈరోజు సుశాంత్‌ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రం టీజర్‌ ని అభిమానులతో సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాడు నాగ్‌. ఇందులో సుశాంత్‌ న్యూలుక్‌ లో కనిపించడమే కాకుండా ప్రభాస్‌ నటించిన 'బాహుబలి' పాత్రలో కూడా కనిపిస్తున్నాడు. ఈ టీజర్‌ చూస్తుంటే పూనమ్‌ బజ్వా ఇందులో రెచ్చిపోయి మరి అందాలు ప్రదర్శించినట్లు తెలుస్తుంది.

బాలకృష్ణ 'ఆదిత్య 369' తరహాలో ఇందులో ఒక టైమ్‌ మిషన్‌ కాన్సెప్ట్‌ని తీసుకుని కామెడీని బాగా పండించినట్లు తెలుస్తుంది. ఇందులోకి కామెడీ కింగ్‌ బ్రహ్మానందం వెళ్లడం, ఆలోచనలు మారిపోవడం వంటి కాన్సెప్ట్‌ చాలా బాగుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ మరియు శ్రీ నాగ్‌ కార్పోరేషన్‌ సంస్థ సంయుక్తంగా నిర్మించింది.

1/7 Pages

దర్శకుడు:

కామెడీ చిత్రాలు తెరకెక్కించే జి. నాగేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

English summary

Aatadukundam Raa movie teaser. Sushanth latest movie Aatadukundam Raa teaser were released. This movie is directing by G. Nageshwara Reddy.