టైం మెషిన్ తో నవ్వులు పూయిస్తున్న ఆటాడుకుందాం రా ట్రైలర్

Aatadukundam Raa movie trailer

05:28 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Aatadukundam Raa movie trailer

కాళిదాసు, కరెంట్, అడ్డా వంటి యావరేజ్ చిత్రాలతో హీరోగా ప్రేక్షకుల్లోనూ, అక్కినేని అభిమానుల్లోనూ మంచి పేరు తెచ్చుకున్న హీరో సుశాంత్. కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు తాజాగా 'ఆటాడుకుందాం.. రా' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కామెడీ కింగ్ జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీజి ఫిలింస్ పతాకాలపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సోనమ్ బజ్వా హీరోయిన్ గా నటించింది. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఆడియోను ఈ రోజు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో నిర్వహించరు.

ఈ సందర్భంలో ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలచేశారు. ఈ ట్రైలర్ ను చూస్తుంటే 'ఆదిత్య 369' లో టైం మెషిన్ ని తీసుకుని ఇందులో పేరడీ చేసినట్లు తెలుస్తుంది. సినిమా కధ ఎలా వున్నా ఈ సన్నివేశాలు మాత్రం కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఒకసారి ట్రైలర్ పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

English summary

Aatadukundam Raa movie trailer