ఇండియా ఓ గొప్ప దేశం, ఎప్పటికీ మర్చిపోలేను: ఏబీ డివిలియర్స్

AB De Villiers about India and his autobiography

05:50 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

AB De Villiers about India and his autobiography

క్రికెట్ లో దాదాపు రెండు దశాబ్ధాలు పైనే ఆడిన సచిన్ టెండూల్కర్ ఎప్పుడూ విమర్శల జోలికి వెళ్ళలేదు, అంతే కాదు సచిన్ ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడింది లేదు. సచిన్ గ్రౌండ్ లో ఎంతో క్రమ శిక్షణగా ఉండే వాడు. అందుకే ఆయనకు ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని తెచ్చి పెట్టింది. అయితే ఇప్పుడు మనం ఒక విదేశీ ఆటగాడు గురించి మాట్లాడుకోబోతున్నాం.. అతనే సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు 'ఏబీ డివిలియర్స్'. బౌలర్ ని ముప్పుతిప్పలు పెట్టే ఏబీ గ్రౌండ్ లో అడుగు పెట్టగానే సిక్సర్ల మోత మోగాల్సిందే. బంతి పిచ్ పై పడగానే స్టేడియం దాటి వెళ్లాల్సిందే.. సచిన్ లానే ఏబీ కూడా ఎంతో క్రమ శిక్షణతో ఉంటాడు.

ఎప్పుడూ ఆట పైనే దృష్టి తప్ప మైదానంలో ఎవరితోనూ గొడవ పడింది లేదు. అంత గొప్ప ఆటగాడైనా తనలో కొంచెం అహం కూడా చూపించడు. అందుకే ఏబీకి తన దేశంలోనే కాకుండా ఇండియాలో కూడా అభిమానులు ఉన్నారు. అయితే ఏబీ తాజాగా ఇండియా గురించి తన మనసులోని ఆలోచనల్ని పంచుకున్నాడు. ఆ విషయంలోకి వెళితే..

1/5 Pages

ఏబీ డివిలియర్స్ తన ఆటో బయోగ్రాఫీలో చాలా విషయాలను వెల్లడించాడు. ఆ పుస్తకం ఆవిష్కరణకు ముందే భారతదేశంలోకి రానుంది. కాగా, ఈ సందర్భంగా భారతదేశంలో మీకు చాలా మంది అభిమానులున్నారని మీడియా ప్రశ్నించగా.. తాను భారతదేశంలో ఎప్పుడు ఆడినా చాలా గొప్ప స్పందన వస్తుందని, అది తాను ఎప్పుడూ ఊహించలేదని తెలిపాడు. 2015లో వాంఖడే స్టేడియంలో ఇండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తాను మైదానంలోకి వస్తున్న సమయంలో చాలా అరుదైన అనుభవం ఎదుర్కొన్నట్లు తెలిపారు. తాను బ్యాటింగ్ చేసేందుకు వస్తున్న సమయంలో భారత అభిమానులు కూడా ఏబీ ఏబీ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారని, అది నేను ఇప్పటికీ మర్చిపోలేని అనుభవమని చెప్పాడు.

English summary

AB De Villiers about India and his autobiography. South Africa dangerous batsmen AB De Villiers talks about his autobiography and India.