క్రిస్మస్‌కి వస్తున్న 'అబ్బాయితో అమ్మాయి'

Abbaitho Ammai releasing on December 25

10:37 AM ON 28th November, 2015 By Mirchi Vilas

Abbaitho Ammai releasing on December 25

వరుస చిత్రాలు చేస్తూ జోరు మీదున్న కథానాయకుడు నాగశౌర్య తాజాగా నటిస్తున్న చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన పల్లక్‌ లల్వాని నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని, పాటలని ఇటీవలే విడుదల చేశారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ పాటలకు మంచి స్పందన వస్తోంది. 'మోహనరూపా ఫిలింస్‌', 'జెజి సినిమా', 'కిరణ్‌ స్డూడియోస్‌', 'బ్లూమింగ్‌ స్టార్స్‌ మోషన్ పిక్చర్స్‌' ఈ నాలుగు సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రమేశ్‌ వర్మ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రానికి సంబంధించి ప్రీప్రొడక్షన్‌ పనులు, రీరికార్డింగ్‌ పనులు పూర్తి చేసుకుని క్రిస్మస్‌కి కానుకగా డిసెంబర్‌ 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రాన్ని రమేశ్‌ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇది లవ్‌స్టొరీ అయినప్పటికీ మాస్‌ మరియు ఫ్యామిలీస్‌ చూసేలా ఈ చిత్రం ఉంటుందని ఈ చిత్రంలో పల్లక్‌ లల్వాని అందాలు ప్లస్‌పాయింట్‌ అవుతుందని నిర్మాతలు తెలియజేశారు.

English summary

Abbaitho Ammai releasing on December 25 which was acted as lead roles in this film is Naga Shourya and Palak Lalwani and the movie is directed by Ramesh Varma.