'అబ్బాయితో అమ్మాయి' విడుదల వాయిదా!

Abbaitho Ammayi movie release postponed

12:01 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Abbaitho Ammayi movie release postponed

ఊహలు గుసగుసలాడే, లక్ష్మీరావే మా ఇంటికి , దిక్కులు చూడకు రామయ్య వంటి క్లాస్‌ చిత్రాలతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నాగశౌర్య. నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం 'అబ్బాయితో అమ్మాయి' రమేష్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాస్స్‌ వచ్చింది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందనే వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా డిసెబంర్‌ 24న విడుదల చెయ్యాలనుకున్నారు. అయితే ఆ వారంలో గోపిచంద్‌ సౌఖ్యం చిత్రంతో పాటు చాలా సినిమాలు పోటీ పడుతుండడంతో క్రిస్మస్‌ బరి నుండి 'అబ్బాయితో అమ్మాయి' తప్పుకుంది.

వారం రోజులు గ్యాప్‌ తీసుకుని న్యూఇయర్‌ కానుకగా జనవరి 1న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. జెజె సినిమాస్‌ పతాకం పై జక్కం వందనా అలేఖ్య నిర్మించిన ఈ చిత్రంలో నాగశౌర్య సరసన పాలక్‌ లల్వాని హీరోయిన్‌గా నటించింది.


English summary

Abbaitho Ammayi movie release postponed due to heavy compitetion on December 24th & 25th.