ప్రభుదేవా డాన్స్ అదుర్స్ : అభినేత్రి టీజర్

Abhinetri movie teaser

10:49 AM ON 4th June, 2016 By Mirchi Vilas

Abhinetri movie teaser

తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ కీలకపాత్రల్లో రూపుదిద్దుకుంటున్న అభినేత్రి చిత్రం టీజర్ శుక్రవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదలైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎ.ఎల్. విజయ్, ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్, సోగ్గాడే చిన్నినాయనా దర్శకుడు కల్యాణ్కృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రంలో అమీ జాక్సన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఎం.వీ.వీ. సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రభుదేవా మాట్లాడుతూ దర్శకుడు విజయ్కు ఓపిక చాలా ఎక్కువ అన్నారు. ఈ చిత్రం కథ కొంచమే తనకు తెలుసని, మొత్తం కథ తమన్నాకు తెలుసని పేర్కొన్నాడు. తమన్నా మంచి నటి అని అభినందించాడు.

English summary

Abhinetri movie teaser