ప్యారిస్ దాడుల సూత్రధారి అబోద హతం

Aboda decimation of the mastermind of the attacks of Paris ..

05:16 PM ON 19th November, 2015 By Mirchi Vilas

Aboda decimation of the mastermind of the attacks of Paris ..

ప్యారిస్‌ లో గత వారం దాడులకు పాల్పడిన ఐసిస్‌ ఉగ్రవాది అబోద్‌ హతమర్చామని ఫ్రాస్స్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్యారిస్‌ దాడులకు ప్రధాన సూత్రధారి ఈ అబోద్‌.అబోద్‌తో పాటు మరోఓ ముగ్గురు తీవ్రవాదులను కూడా హతమార్చినట్లు తెలిపారు.ఇద్దరు ఇంటెలిజెన్స్‌ అధికారుల చెప్పిన వివరాల ప్రకారం ప్యారిస్‌ శివారు ప్రాంతంలోని డెన్నిస్‌ లోని ఒక అపార్టుమెంట్‌ లో ఉగ్రదాదులు తల దాచుకున్నారన్న సమాచారంతో ప్యారిస్‌ పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌ను చుట్టు మట్టారు.

అపార్ట్‌మెంట్‌ను అన్ని వైపుల నుండి చుట్టుమట్టిన పోలీసులు దాడి చేసారు.దీంతో ఎదురు దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ప్యారిస్‌ పోలీసులకు మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో ప్రధాన సూత్రధారి అబోద్‌ తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అంతం చేసారు. హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒక మహిళా ఉగ్రవాది కూడా ఉన్నట్లు తెలిపారు. మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టు కున్నారు.ఈ కాల్పుల్లో తీవ్రగాయలైన పోలీసులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు.

English summary

Aboda decimation of the mastermind of the attacks of Paris ..