10 వేల గదులు, 70 రెస్టారెంట్లు, 4 హెలీప్యాడ్లు.. కానీ సిటీ కాదు!

Abraj Kudai Towers World's largest hotel in Saudi Arabia

04:56 PM ON 11th August, 2016 By Mirchi Vilas

Abraj Kudai Towers World's largest hotel in Saudi Arabia

10 వేల గదులు, 70 రెస్టారెంట్లు, 4 హెలీప్యాడ్లు ఇవేవో సిటీలోని సౌకర్యాలని అనుకుంటే తప్పులో కాలేసినట్టే... ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్. ఈ హోటల్ ను సౌదీ ఆర్థిక మంత్రిత్వ శాఖ 3.5 బిలియన్ డాలర్ల వ్యయంతో ముస్లింలకు అతి పవిత్రమైన నగరం మక్కాలో నిర్మించనుంది. మక్కా నగరాన్ని పవిత్రంగా భావించడంతో కోట్ల మంది ముస్లింలు ప్రతిఏటా క్యూకడతారు. దీంతో వారికి సౌకర్యాల కల్పన సౌదీ ప్రభుత్వానికి శక్తికి మించిన పనిగా మారుతోంది. దీనికి శాశ్వత పరిష్కారంగా అతి పెద్ద భవన నిర్మాణానికి సౌదీ ప్రభుత్వం పూనుకుంది. దీంతో ప్రతిఏటా మక్కాను దర్శించుకునేందుకు వచ్చే పర్యటకుల కోసం అబ్రజ్ కుడయ్ పేరిట భారీ హోటల్ నిర్మిస్తున్నారు.

1/3 Pages

ఈ హోటల్ 12 టవర్లతో కోటి యాభైలక్షల చదరపుటడుగుల్లో విస్తరించి ఉంటుంది. 45 అంతస్తుల ఈ భవనంలో దాదాపు 10,000 గదులు, 70 రెస్టారెంట్లు, నాలుగు హెలీప్యాడ్లతో రాజసౌధాన్ని తలపిస్తుంది. రికార్డుల పరంగా చూస్తే... ప్రపంచంలో అత్యధిక గదులు ఉన్న హోటల్ ఇదే. అతిపెద్ద టవర్లకు అతిపెద్ద పైకప్పులో రికార్డు ఈ హోటల్ సొంతకావడం విశేషం. ఈ భవనంలో ఐదు అంతస్తులు కేవలం సౌదీ రాజకుటుంబానికి మాత్రమే రిజర్వు అయి ఉంటాయి. 12 టవర్లలో రెండు టవర్లలో ఫైవ్ స్టార్ సౌకర్యాలు కల్పించనుండగా, మిగిలిన 10 టవర్లలో ఫోర్ స్టార్ సౌకర్యాలు కల్పించనున్నారు.

English summary

Abraj Kudai Towers World's largest hotel in Saudi Arabia