అసదుద్దీన్‌ నాలుక తెగ్గోస్తే రూ.21 వేల బహుమతి ఇస్తా..

ABVP Leader Offers Reward On Asaduddin Owaisi Tongue

04:14 PM ON 17th March, 2016 By Mirchi Vilas

ABVP Leader Offers Reward On Asaduddin Owaisi Tongue

సంచలన వ్యాఖ్యలకు కేర్ అఫ్ అడ్రస్ అయిన ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్‌ ఒవైసి ఇటీవల "తన మెడ పై కట్టి పెట్టినా భారత మాతకు జై అనేది లేదు" అని ఒక బహిరంగ సభలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అసదుద్దీన్‌ పై అనేక మంది రాజకీయ నేతలు , నాయకులు అయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అయన తీరును ఎండగడుతున్నారు. నిన్నటికి నిన్న పెద్దల సభగా భావించే రాజ్యసభ లో సైతం ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ మాట్లాడుతూ "ఓ వ్యక్తి తనను తాను జాతీయ నాయకుడిగా భావిస్తున్నారు.. కానీ ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రాంతానికి మాత్రమే నాయకుడు. ఇక రాజ్యాంగంలో లేదు కాబట్టి ‘భారత్‌ మాతాకీ జై’ అని అనను అన్నారు. మరి ‘షేర్వానీ వేసుకోవాలని, టోపీ పెట్టుకోవాలని రాజ్యాంగంలో ఉందా?" అంటూ జావేద్ చురకలంటించారు. అందుకే నేను ఆయన వ్యాఖ్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను’ అని అన్నారు ".

ఇది ఇలా ఉంటే తాజాగా ఉత్తరప్రదేశ్ లో కుడా అసదుద్దీన్‌ ఒవైసి వ్యాఖ్యల పై అగ్గి రగులుతోంది . ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కాలేజ్ కు చెందిన ఏబీవీపీ విద్యార్ధి లీడర్ ఒకరు అసదుద్దీన్‌ వ్యాఖ్యలను ఎండగడుతూ , తన మెడ పై కట్టి పెట్టినా భారత మాత కి జై అనేది లేదని అన్న అసదుద్దీన్‌ ఒవైసి నాలుక తెగ్గోసుకు వస్తే వారికి 21 వేల రూపాయల బహుమతి ఇస్తానని ప్రకటించాడు. భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అసదుద్దీన్‌ ఒవైసి లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని ఆ ఏబీవీపీ నేత డిమాండ్ చేసారు .

మెడపైన కత్తి పెట్టినా.. భారత్ మాతా కీ జై అనేది లేదు

అసదుద్దీన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేవైఎం

హైదరాబాద్ బాంబు మహారాష్ట్రలో పేలింది

పది కోట్లు ఇవ్వలేదని శవంగా మార్చారు

రోజా సస్పెన్షన్ కొట్టేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

English summary

MIM Party Leader Asaduddin owaisi made some controversial words that He Never Say Bharata Mata Ki Jai even though some puts sword on his neck. So many people and politicians opposed Asaduddin Words and now a ABVP leader in Uttar Pradesh announced 21 thousand rupees reward on Asaduddin Toungue. He also demanded to dismiss him from Rajya Sabha.