మళ్ళీ తెరపైకి ఓటుకి నోటు కేసు

ACB Notices To Muttayya in Note for Vote Case

12:45 PM ON 13th February, 2016 By Mirchi Vilas

ACB Notices To Muttayya in Note for Vote Case

టి టిడిపి నేతగా రేవంత్ రెడ్డి ఎన్నికైన నేపధ్యంలో గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసులో మళ్లీ కదులుతోందా? అవుననే అనుమానం వస్తోంది. ఇన్నాళ్ళూ స్తబ్దత గా వున్న ఈకేసు లో జెరూసలేం మత్తయ్యకు తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు తాఖీదులు అందజేయడం ఇందుకు తార్కాణమని అంటున్నారు. ఉప్పల్‌లోని ఆయన ఇంటికి వెళ్లి తాఖీదులు అంటించి మరీ వచ్చారు. వారంలోగా ఎసిబి కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలమేరకు అరెస్టు చేసేది లేదుకానీ, విచారణకు మాత్రం సహకరించాలని మత్తయ్యను ఎసిబి కోరింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం నోటీసులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వారంలోగా బంజారాహిల్స్‌లోని తమ కార్యాలయానికి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల లోగా హాజరుకావాలని తాఖీదుల్లో పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యేను ఎసిబి అధికారులు అరెస్టు చేసే అవకాశముందని వూహాగానాలు వెలువడిన నేపథ్యంలో మత్తయ్యకు ఏసీబీ అధికారులు తాఖీదులు జారీచేయడం చర్చనీయాంశం అయింది. తెలంగాణాలో టిడిపి తరపున 15 మంది ఎంఎల్ఎ లు ఎన్నికవ్వగా, ఇందులో 10 మంది గులాబి దళంలో చేరిపోయారు. మిగిలిన 5 గురికి రేవంత్ సారద్యం వహిస్తున్నారు.

English summary

Telangana Anti Corruption Bureau(ACB) sends notices for Muttayya.ACB has ordered muttayya to attend for investigation within in week at 10:30 a.m to 5:00 p.m. Recently 10 od 15 Telangana TDP MLS's were joined in TRS party.