ఎసిబికి చిక్కిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్

ACB Ride On Nandyal Building Inspector

01:58 PM ON 1st December, 2015 By Mirchi Vilas

ACB Ride On Nandyal Building Inspector

రోజూ ఏదో చోట అవినీతి నిరోధక శాఖ దాడులు చేయడం, ఎవరో ఒకరిని పట్టుకోవడం సహజమై పోయింది. అయినా పరిస్థితిలో మార్పు లేదు. ఎవడైతే నాకేంటి అనే చందంగా వ్యవస్థ నడుస్తోంది. తాజాగా మంగళవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయంపై ఎసిబి అధికారులు దాడులు చేసారు. లంచం డిమాండ్ చేసిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కమల్ బాషా ఎసిబికి చిక్కాడు. ఎస్ బి ఐ కాలనీలో ఓ ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు కోసం 5వేల రూపాయల లంచం డిమాండ్ చేసిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సదరు లంచం తీసుకుంటూ ఎసిబి కి దొరికిపోయాడు

English summary

Anti Corruption Bureau(ACB) rides on municipal building inspector of nandyala in kurnool district due to having of illegal properties