రియల్ దందాలో సబ్ రిజిస్త్రార్ 

ACB Ride On Vizag Subregister Anand KUmar

12:59 PM ON 31st December, 2015 By Mirchi Vilas

ACB Ride On Vizag Subregister Anand KUmar

వివాదంలో వున్న ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా కోట్ల రూపాయలను దండుకుంటూ , మరోవైపు రౌడీ షీటర్లు , రియల్టర్ల తో కల్సి దందా కూడా సాగిస్తున్న ఓ సబ్ రిజిస్త్రార్ ని ఎసిబి అధికారులు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా అతని ఆస్తులపై దాడులు సాగిస్తున్నారు. తెవ్వే కొద్దీ అతని అక్రమాలు బయటపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే ,

విశాఖ మధురవాడ సబ్ రిజిస్త్రార్ గా పనిచేస్తున్న ఆనంద్ కుమార్ వందల కోట్ల రూపాయలకు ష్టితిమంతుడయ్యాడు. ఎసిబి డిఎస్పీ రామకృష్ణ సారధ్యంలో ఏకకాలంలో విశాఖ , పశ్చిమ గోదావరి , హైదరాబాద్ తదితర చోట్ల దాడులు సాగించడంతో ఎన్నో అక్రమాలు వెలుగుచూశాయి. వివాదాల్లో వున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ తో పాటూ కొంతమంది రియల్టర్లు , రౌడీ షీటర్ల తో కల్సి దందా సాగిస్తున్నట్లు బయట పడింది.

పాలరాతితో కూడిన దాదాపు 7 కోట్ల రూపాయల విలువచేసే విలాస వంతమైన భవనం , ఖరీదైన భూములు , ఎస్టేట్లు , కార్లు వున్నాయి. కీలక పత్రాలతో పాటూ ఓ రివాల్వర్ , ఓ గండ్ర గొడ్డలి , 35 తూటాలు , కత్తులు ఆనంద్ కుమార్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతని నివాసం లోని ఓ ఫ్లోర్ లో ఏకంగా దియేటర్ కూడా వుందంటే, అతని స్థాయి ఏమిటో చెప్పనవసరం లేదు.

English summary