ఎసిబి కేసులే కేసులు 

ACB Rides On Ananthapuram Sub-Register Office

07:17 PM ON 21st December, 2015 By Mirchi Vilas

ACB Rides On Ananthapuram Sub-Register Office

ఎపిలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ అవినీతి నిరోధక అధికారుల దాడులు సాగిస్తూ , కేసులు నమోదు చేస్తున్నారు. అయినా మార్పు లేదు. సబ్ రిజిస్త్రార్ కార్యాలయాలు , రెవెన్యు కార్యాలయాలు , పంచాయితీ అధికారుల కార్యాలయాలు ఎక్కువగా ఎసిబి సోదాలో కనిపిస్తున్నాయి.

తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి, అనధికారికంగా వున్నా 52 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్టార్ తో పాటూ మరో నలుగురు ఉద్యోగులపై కేసు నమోదు చేసారు.

ఓ పక్క కేసులు పెడుతున్నా మరోపక్క వీటిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. కావాలనే జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

English summary

Anti Corruption Beauro (ACB) rides on Sub-Register Office in Ananthapuram. ACB found 52 thousand of illegal money in the office and ACB officials filed cases on 4 members