బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడి.. భారీగా అక్రమాస్తులు గుర్తింపు(వీడియో)

ACB sudden raid on Vizag CI Balakrishna's house

12:10 PM ON 22nd June, 2016 By Mirchi Vilas

ACB sudden raid on Vizag CI Balakrishna's house

ఆగండి టైటిల్ చూసి కంగారు పడకండి, మీరు ఏమనుకుంటున్నారో మాకు తెలుసు, అలా అనుకుంటే తప్పులో కాలు వేసినట్లే. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. విశాఖపట్నంలో అవినీతి నిరోధక శాఖాధికారులు ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా మెరుపు దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో విశాఖ 4వ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఇళ్ల పై ఏసీబీ మెరుపు దాడులకు దిగింది. ఒక చోటే కాకుండా.. పీఎం పాలెంలోని బాలకృష్ణ ఇంటితో పాటు, 4వ టౌన్ పీఎస్, విజయనగరం, కొవ్వూరు సహా మొత్తం 8 చోట్ల అతని బంధువుల ఇళ్ల పై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

కాగా.. సీఐ బాలకృష్ణకి ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఈ దాడులు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలానే ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం దాడులు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తుండగా.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సోదాలు పూర్తి అయ్యాక వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ తెలిపింది. ఒకసారి ఈ కింద వీడియో పై మీరు ఒక లుక్ వెయ్యండి.

English summary

ACB sudden raid on Vizag CI Balakrishna's house