లారీ , వ్యాన్ డీ - ముగ్గ్గురు మృతి 

Accident In West Godavari District

10:26 AM ON 7th January, 2016 By Mirchi Vilas

Accident In West Godavari District

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద 16వ జాతీయరహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించి , ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంభందించి వివరాల్లోకెళితే.. నల్గొండ జిల్లా హుజుర్‌నగర్‌ నుంచి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైపు వెళ్తున్న వరినాట్ల యంత్రాన్ని తీసుకెళుతున్న మినీ వ్యాను కైకరం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వుండగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వ్యాను డ్రైవర్‌ మహ్మద్‌ రసూల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనాస్థలంలోనే రమేశ్‌, పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడకు చెందిన పిల్లి రమేశ్‌, మరో వ్యక్తి మృతిచెందారు. గాయ పడిన రసూల్‌ను చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వఆసుపత్రికి తరలించారు. గణపవరం సీఐ ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాను డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

English summary

Today early morning an road accident occured in Kaikaram, west godavari district.In this incident 3 members died and one person was severly injured