ప్రమాదం నుంచి బయటపడ్డ మోహన్ లాల్

Accident To Mohan Lal Car

01:12 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Accident To Mohan Lal Car

ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో తెరకెక్కనున్న 'జనతా గ్యారేజ్' సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భారీ ప్రమాదం నుండి బయటపడ్డాడు . వైశాక్ దర్శకుడిగా ఆయన నటిస్తున్న తమిళ చిత్రం ‘పులి మురుగన్’. ఈ సినిమా షూటింగ్ కేరళలోని మళయతూర్ ప్రాంతంలో జరుగు తున్న నేపధ్యంలో లొకేషన్‌కి చేరుకొనే క్రమంలో హైవే పై వస్తున్న మోహన్ లాల్ కారును లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు డేమేజ్ అయింది. అయితే మోహన్ లాల్, ఆయన డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారు. విషయం తెల్సిన యూనిట్ సహా అక్కడి సినీ వర్గీయులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కంప్లీట్ యాక్టర్‌గా పిలవబడే మోహన్ లాల్ తెలుగులో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో 'మనమంతా' సినిమా లో కూడా నటిస్తున్నాడు. మోహన్ లాల్ కి పెను ప్రమాద తప్పడంతో జనతా గ్యారేజ్ యూనిట్ కూడా ఊపిరి పీల్చుకుంది.

English summary

Malayalam Star Actor Mohan Lal's car was hit by loory during when he was going to shooting to one Malayalam Film.In this accident car was damaged and Mohan Lal and his car driver get out safely. Presently Mohan Lal have signed Junior NTR;s upcoming movie "Janata Garriage" which was going to be directed by Koratala Shiva