తిరుమలలో వసతి సదుపాయాలు గురించి తెలుసుకోండిలా...

Accommodations that available in Tirumala

11:58 AM ON 28th October, 2016 By Mirchi Vilas

 Accommodations that available in Tirumala

తిరుపతి, తిరుమలలో భక్తుల వసతి కోసం టీటీడీ 4,850కు పైగా కాటేజీలు, చౌల్ట్రీలు, గెస్ట్ హౌస్ లను నిర్మించింది. ఉచితం దగ్గర్నుంచి పెయిడ్ వరకు వసతి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

1/10 Pages

తిరుపతిలో  శ్రీనివాసం...


తిరుపతి చేరుకున్న తర్వాతే తిరుమల వెళ్లాల్సి ఉంటుందనే విషయం తెలుసు. దూర ప్రయాణం చేసి ఉన్న వారు తిరుపతిలో కాస్త సేద తీరి తిరుమలకు వెళదామనుకుంటే తగినన్ని వసతులు ఉన్నాయి. అలాగే, తిరుపతి చుట్టు పక్కల ప్రదేశాలను చూసి వెళ్లాలనుకున్నా ఇక్కడ బస చేయవచ్చు. బస్ స్టేషన్ నుంచి అరకిలోమీటరు దూరంలో శ్రీనివాసం అనే పెద్ద వసతి సముదాయం ఉంది. ఇక్కడ 200 నుంచి 600 రూపాయల గదులను పొందవచ్చు. ఏసీ గదుల చార్జీ 600 రూపాయలు. భక్తులు 45 రోజులు ముందుగానే శ్రీనివాసంలో వసతిని బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్ కు ఎదురుగా శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హస్ ఉంటుంది. ఇక్కడ 45 రూమ్స్ ఉన్నాయి. చార్జీ 150 రూపాయలు.

English summary

Accommodations that available in Tirumala