రోజాతో  సహా 5గురి తీరు హేయనీయం!

Action On Five MLA's Along With Roja

12:37 PM ON 20th February, 2016 By Mirchi Vilas

Action On Five MLA's Along With Roja

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జీరో అవర్‌ సందర్భంగా వైసిపి ఎంఎల్ఎ రోజాసహా ఆపార్టీకి చెందిన ఐదుగురు వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ తప్పుబట్టి నట్లు తెలుస్తోంది. రోజా వ్యాఖ్యలను నిరసిస్తూ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం, ఏడాదిపాటు రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు నిర్ణయం తీసుకోవడం, దీనిపై రాద్ధాంతం సాగడం తెల్సిందే. అయితే దీనిపై డిప్యూటి స్పీకర్ శ్రీ మండలి బుద్ద ప్రసాద్ అధ్యక్ష్యతన మూడు పార్టీల సభ్యులతో కమిటీని కూడా స్పీకర్ ఏర్పాటుచేసిన సంగతి తెల్సిందే. ఇప్పటికే ఈ కమిటీ రోజా , టిడిపి ఎంఎల్ఎ అనిత తదితరులను కమిటీ విచారించింది. రోజా క్షమాపణ చెప్పాలన్న ప్రతిపాదన వచ్చినట్లు , దానికి రోజా ససేమిరా అన్నట్లు వార్తలొచ్చాయి. మరోపక్క ఈ అంశంపై రోజా కోర్టుని కూడా ఆశ్రయించింది.

ఇక అసెంబ్లీ కార్యాలయంలో శుక్రవారం ఈ కమిటీ తుది సమావేశం జరిగింది. రోజా తో సహా మొత్తం 5గురు సభ్యుల తీరుని సమావేశంలో చర్చించి తప్పుబట్టినట్లు చెబుతున్నారు. అయితే నిబంధనల ప్రకారం కమిటీ తన నివేదికను స్పీకర్‌కు ఇచ్చేంత వరకు ఆ సమాచారాన్ని కమిటీ సభ్యులు ఎవ్వరూ బయటకు వెల్లడించకూడదట. ఒకవేళ నివేదికలోని అంశాలను వెల్లడించాల్సి వస్తే కమిటీ చైర్మన్‌ మాత్రమే ఆ విషయాలను తెలియజేయాలట. కానీ కమిటీ తుది సమావేశం ముగిసిన వెంటనే కమిటీలో సభ్యుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నివేదికలోని అంశాలను మీడియాకు వెల్లడించారు. వైసీపీ పై బురదజల్లే అజెండాతోనే బుద్ధప్రసాద్‌ కమిటీ నివేదిక రూపొందించిందని ఆరోపించారు. రోజాసహా ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై కఠిన చర్యలకు కమిటీ సిఫారసు చేసిందన్నారు. సామాజిక మీడియాకు అసెంబ్లీ వీడియోలు లీకైన అంశాన్ని సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేద్దామన్నా కమిటీ స్పందించలేదన్నారు. కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ డిసెంట్‌ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. అయితే దీని పై టిడిపి సభ్యుడు శ్రవణ్ కుమార్ స్పందిస్తూ , వైసీపీ వ్యవహరించిన తీరు దొంగే దొంగ అన్నట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జరిగిన అంశాలు ఆయన ప్రస్తావించారు. కాగా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

English summary

Previously Ysrcp MLA Roja has suspended from Andhra pradesh assembly for 1 year for her misbehaviour in assemble. Speaker kodela shiva prasad has suspended for one year and later a committee has Appointed by the Assembly speaker to investigate this issue.Committe says that 5 Ysrcp MLA's along with roja have behaved worlsty in Andhra Pradesh Assembly.But Ysrcp party leaders has opposed this and by saying this all was Conspiracy.